బన్నీ, రానా కోసం నన్ను తొక్కేస్తున్నారు.. అరవింద్, సురేష్‌బాబుపై యువ హీరో ఆరోపణలు

సినీ పరిశ్రమలో వారసత్వం అనేది ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నది. తమకు పరిచయం ఉన్న హీరోలు, సినీ కుటుంబాల పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడం, అలాగే తమ కుటుంబంలోని వారిని ఇండస్ట్రీకి పరిచయం చేయడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో సుశాంత్ సూసైడ్ చేసుకోవడం, ఆ తర్వాత బంధుప్రీతి అంటూ ఆరోపణలు రావడంతో మళ్లీ ఈ అంశం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ నెపొటిజం గురించి మాట్లాడుతూ ఓ హీరో చేసిన వ్యాఖ్యలను బయటపెట్టారు. ఆ హీరో ఏం అన్నారంటే..

బంధుప్రీతితో లబ్ది పొందడం

బంధుప్రీతితో లబ్ది పొందడం

సినీ పరిశ్రమలో బంధుప్రీతి ద్వారా లబ్ది పొందాలనుకోవడం ఎవరి తరం కాదు. అలా అనుకొంటే స్టార్ హీరోల కుమారులందరూ స్టార్ హీరోలు అయిపోవాలి. కానీ అలా జరగడం లేదే. నిర్మాతలు తమ సంతానాన్ని హీరోలు నిలబెట్టాలనుకోవడం వారి చేతుల్లో లేదనే విషయం తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ప్రూవ్ అయింది. హిందీలో ఫిరోజ్ ఖాన్, అమితాబ్ లాంటి హీరోలు తమ కుమారులను స్టార్ హీరోలుగా చేశారా? అని వర్మ ప్రశ్నించారు.

అల్లు అరవింద్‌కే సాధ్యం కాలేదు

అల్లు అరవింద్‌కే సాధ్యం కాలేదు

అలాగే తెలుగులో నిర్మాత అల్లు అరవింద్ తన కుమారులిద్దరినీ హీరోలు చేశారు. అల్లు అర్జున్‌కు స్టార్ హీరో స్టేటస్ వచ్చింది. అతడి టాలెంట్‌ను, ఫెర్ఫార్మెన్స్‌ను ప్రేక్షకులు గుర్తించారు. కాబట్టి అతడు టాలీవుడ్‌లో అగ్ర హీరోగా గుర్తింపు పొందారు. పాపులారిటీని సాధించారు. కానీ తన రెండో కొడుకు శిరీష్‌ను స్టార్ హీరో చేయడంలో అల్లు అరవింద్ సక్సెస్ కాలేకపోయాడనే విషయాన్ని వర్మ గుర్తు చేశారు.

అల్లు అరవింద్, సురేష్‌బాబుపై యువ హీరో ఆరోపణలు

అల్లు అరవింద్, సురేష్‌బాబుపై యువ హీరో ఆరోపణలు

ఇక నాకు తెలిసిన తమిళ హీరో ఒకరు నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. బన్నీ, రానాను ఇండస్ట్రీలో నిలబెట్టేందుకు నన్ను తొక్కేస్తున్నారు. తెలుగులో మాకు థియేటర్లు ఇవ్వడం లేదు. మా సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుకొంటున్నారనే విధంగా నాతో చెప్పారు. అయితే ఒక హీరోను అడ్డుకొనే స్థాయి, స్టామినా ఏ నిర్మాతకు లేదు. కేవలం ప్రేక్షకులకు మాత్రమే ఆ సత్తా ఉంది. ప్రేక్షకుడు అనుకొంటే ఎవరైనా స్టార్ హీరో అవుతాడు. కానీ నిర్మాత తలచుకొంటే ఎవరు కూడా స్టార్ హీరో కాలేరు అని వర్మ చెప్పారు.

స్టార్ స్టేటస్‌ను డిసైడ్ చేసేది ప్రేక్షకుడే

స్టార్ స్టేటస్‌ను డిసైడ్ చేసేది ప్రేక్షకుడే

ఒక సినిమా హీరో మూవీని థియేటర్‌లో లేకుండా చేసి దెబ్బ కొట్డడం అనేది వాస్తవానికి దూరం. థియేటర్లో ఎవరి మూవీ, ఏ సినిమా ఉండాలనేది ప్రేక్షకుడి ఛాయిస్. ప్రేక్షకుడి ఆదరణ ఉంటేనే ఏదైనా సినిమా ఆడటం ఏ హీరో స్టార్ అవ్వడం జరుగుతుంది. అంతేగానీ ఓ స్టార్ హీరోనో, నిర్మాతనో తలచుకొంటే తమ కుమారులను హీరోలు చేయడమనే జరగని పని. ఇలా ఆరోపణలు చేయడం కేవలం పనికి రాని వ్యవహారమనేది నా అభిప్రాయం అని వర్మ పేర్కొన్నారు.

Recommended Video

Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
వివేక్ ఒబేరాయ్, సుశాంత్ గురించి

వివేక్ ఒబేరాయ్, సుశాంత్ గురించి

సల్మాన్ ఖాన్‌తో గొడవ కారణంగా గతంలో వివేక్ ఒబెరాయ్‌ని, ఇప్పుడుసుశాంత్‌ను తొక్కేసారనడం చాలా తప్పు. కంపెనీ సినిమా వివేక్ ఒబెరాయ్ నటించిన చాలా సినిమాలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు మెప్పు పొందలేకపోయాయి. సల్మాన్ ఖాన్ వెళ్లి ప్రేక్షకులను అడ్డుకొన్నారా? అలాగే సుశాంత్ నటించిన చిచ్చోరే చిత్రం రూ.75 కోట్లు వసూలు చేసింది. అతడు ఫ్లాప్ హీరో కాదు. ఆయన సినిమాలు ఒకరు అడ్డుకొంటే ఇంకా చాలా మంది నిర్మాతలు క్యూలో ఉంటారు. కానీ సుశాంత్ తీసుకొన్న నిర్ణయం సరికాదు. అతడి మరణం తర్వాత వస్తున్న ఆరోపణలు పసలేనివి అని వర్మ అభిప్రాయపడ్డారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X