‘ఎన్టీఆర్-మహానాయకుడు’ కలెక్షన్లు... ఇది వెన్నుపోటుకు సంకేతమా?

Recommended Video

RGV Sensational Comments On Mahayanayakudu Collections And Chandrababu Naidu | Filmibeat Telugu

ఎన్టీ రామారావు రాజకీయ జీవితం ఆధారంగా రూపొందిన 'ఎన్టీఆర్-మహానాయకుడు' సినిమాకు బాక్సాఫీసు వద్ద ఆదరణ లభించడం లేదు. సంక్రాంతికి విడుదలైన 'కథానాయకుడు' కంటే దారుణంగా ఈ చిత్రం కలెక్షన్లు ఉండటం, బాలయ్య లాంటి స్టార్ హీరో నటించి, రామారావు జీవితం ఆధారంగా రూపొందిన మూవీ ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

త్వరలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రామ్ గోపాల్ వర్మ.... 'ఎన్టీఆర్-మహానాయకుడు' కలెక్షన్లు డీలా పడటంపై తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. వీటి ప్రభావం చంద్రబాబుపై పడుతుందన్నారు.

టీడీపీ అభిమానులు కూడా చూడలేదు

టీడీపీ అభిమానులు కూడా చూడలేదు

‘మహా నాయకుడు కలెక్షన్స్ బట్టి ఆ సినిమాని టిడిపి అభిమానులు కూడా చూడలేదని తేటతెల్లంగా అర్థమవుతుంది.' అంటూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా ఈ సినిమా ఉన్నప్పటికీ వారు చూడక పోవడంపై వర్మ ఆశ్చర్య వ్యక్తం చేశారు.

సీబీఎన్‌కు వెన్నుపోటు తప్పదేమో?

సీబీఎన్‌కు వెన్నుపోటు తప్పదేమో?

"మహా నాయకుడు సినిమాను టీడీపీ వారు కూడా చూడటం లేదంటే దీనర్థం ఆ కాలంలో సీబీఎన్... ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినట్టే ఈ కాలంలో టిడిపి వాల్లే సీబీఎన్ ని వెన్నుపోటు పొడవబోతున్నారని 100% గ్యారెంటీ‌గా డబుల్ త్రిబుల్ తేటతెల్లంగా అర్థం అవుతుంది.' అంటూ వర్మ వ్యాఖ్యానించారు.

ఎన్టీఆర్-మహానాయుకుడు వసూళ్లు

ఎన్టీఆర్-మహానాయుకుడు వసూళ్లు

ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా తొలి 3 రోజుల్లో రూ. 3.40 కోట్ల షేర్ రాబట్టినట్లు తెలుస్తోంది. వసూళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, కొన్ని చోట్ల థియేటర్ల అద్దె కూడా వెళ్లని పరిస్థితి ఉందని టాక్.

చంద్రబాబును అందులో విలన్‌గా?

చంద్రబాబును అందులో విలన్‌గా?

రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో చంద్రబాబును విలన్‌గా చూపించబోతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రామారావును వెన్నుపోటు పొడిచి పదవి నుంచి దించేసి తను సీఎం పీఠం ఎక్కారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. ఇదే అంశాన్ని వర్మ ఈ చిత్రంలో చూపించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాలో ఆ రెండు పాయింట్లే కీలకం..

సినిమాలో ఆ రెండు పాయింట్లే కీలకం..

ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో చూపించబోతున్నారు. సినిమా పోస్టర్ మీద ఇది కుటుంబ కుట్రల చిత్రం, వెన్నుపోటు పకర్వం అని ప్రధానంగా పేర్కొనడం బట్టి ఈ రెండు అంశాల చెట్టూ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X