twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలివి తేటలంటే ఇవే.. అది కేవలం యాధృచ్చికమే.. ‘పవర్ స్టార్’పై ఆర్జీవీ క్లారిటీ

    |

    రామ్ గోపాల్ వర్మ అంటే మామూలు విషయం కాదు. ఆయనతో మాట్లాడాలన్నా, పోట్లాడాలన్నా సరే ఎవ్వరూ సాటి రారు. వర్మతో వర్మ మాత్రం గెలవగలడు. పులిని చూపించి అది పులి కాదని మనతోనే చెప్పించగలడు. అందర్నీ నమ్మిస్తాడు కూడా. తాజాగా పవర్ స్టార్ అనే ఓ చిత్రాన్ని వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఓ టిక్ టాక్ స్టార్, అతని వీడియోను షేర్ చేశాడు. అతనే తన పవర్ స్టార్ సినిమాలోహీరో అని ప్రకటించాడు. తాజాగా ఆ సినిమా గురించి వచ్చిన రూమర్స్ (వర్మ ఉద్దేశ్యంలో)పై స్పందించాడు.

    ఫుల్ జోష్‌లో ఉన్న వర్మ..

    ఫుల్ జోష్‌లో ఉన్న వర్మ..

    రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస చిత్రాలో ఊపిరి పీల్చుకోలేనంత బిజీగా ఉన్నాడు. క్లైమాక్స్, నగ్నం, కరోనా వైరస్ వంటి చిత్రాలను తీయగా.. మరో రెండు చిత్రాలను కూడా ప్రకటించాడు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం ఓటీటీలో సందడి చేస్తున్నాయి. అవి రెండూ భారీగానే లాభాలను తెచ్చిపెట్టాయి కూడా.

    వరుస చిత్రాల ప్రకటన..

    వరుస చిత్రాల ప్రకటన..

    టాలీవుడ్‌లో మిగతా వారంతా సినిమాలు ఎలా తీయాలి, ఎలా రిలీజ్ చేయాలని తలలు పట్టుకుంటుంటే.. వర్మ మాత్రం దొరికిన ఈ సమయాన్ని బాగానే వినియోగించుకుంటున్నాడు. వరుసగా చిత్రాలను విడుదల చేసి క్యాష్ చేసుకుంటున్నాడు. సొంతంగా పర్సనల్ యాప్‌ను పెట్టాడు. ఇష్టమొచ్చిన ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తున్నాడు.. లాభాలు ఆర్జిస్తున్నాడు. ప్రస్తుతం పవర్ స్టార్, మర్డర్ అనే రెండు చిత్రాలు లైన్‌లో ఉన్నాయి.

    బుకాయిస్తున్న వర్మ..

    బుకాయిస్తున్న వర్మ..


    పవర్ స్టార్ అనే టైటిల్, ఆయన హీరోగా ప్రకటించిన వ్యక్తి పవన్ కళ్యాణ్‌లా కనిపిస్తున్నాడని, అది కచ్చితంగా పవన్ కళ్యాణ్ మీద తీసే సినిమాయే అని అందిరికీ తెలిసినా, అర్థం అవుతున్నా.. ఆర్జీవీ మాత్రం అలాంటిదేమీ లేదని బుకాయిస్తున్నాడు. తాజాగా మరోసారి అలాంటి రూమర్లపై స్పందించాడు.

    Recommended Video

    Amrutha Pranay కామెంట్స్ పై స్పందించిన Ram Gopal Varma
    అనుకోకుండా జరిగిన యాధృచ్చికమే..

    అనుకోకుండా జరిగిన యాధృచ్చికమే..

    తాజాగా వర్మ ట్వీట్ చేస్తూ.. ‘పవర్ స్టార్ సినిమా అనేది పవన్ కళ్యాణ్ గురించేనని మీడియాలో వస్తున్న రూమర్స్ నిజం కాదు.. పైగా బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవి. రాజకీయ పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో ఓటమి చెందిన ఓ టాప్ ఫిల్మ్ స్టార్‌పై తెరకెక్కిస్తున్న కల్పిత చిత్రమే పవర్ స్టార్. అయితే అందులో నటించబోతోన్న వ్యక్తికి వాస్తవికతలో ఎవరి పోలికలతోనైనా ఉంటే అది అనుకోకుండా జరిగిన యాదృచ్చిక ఘటన' అని ఎంతో తెలివిగా చెప్పుకొచ్చాడు.

    English summary
    Ram Gopal varma About POWER STAR movie. Media speculations that POWER STAR is PAWAN KALYAN’s story is incorrect and irresponsible .. POWER STAR is a fictional story of a top film star who starts a party and loses in the elections ..Any resemblance to reality is accidentally coincidental .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X