రాజమౌళికి కరోనా: జోక్ వేసిన రామ్ గోపాల్ వర్మ.. అనుభవంతో బండ్ల గణేష్ సలహాలు
దర్శకధీరుడు రాజమౌళి ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా భారిన పడటంతో ఇండస్ట్రీలో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా సెలబ్రెటీస్ తో పాటు ఆభిమానులు కూడా వారు త్వరగా కొలుకోవాలని కోరుకుంటున్నారు. అయితే ఈ సమయంలో విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉహీంచని విదంగా స్పందించారు. అలాగే బండ్ల గణేష్ కూడా గత అనుభవంతో జక్కన్నకు జాగ్రత్తలు చెప్పారు. ప్రస్తుతం ఆ అందుకు సంబంధించిన ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

షాక్ ఇచ్చిన రాజమౌళి..
బుధవారం రాత్రి రాజమౌళి చేసిన ట్వీట్ ఒక్కసారిగా అందరిని ఆశ్చర్యపరిచింది. నేను నా ఫ్యామిలీ మెంబర్స్ గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నట్లు చెబుతూ.. జ్వరం తగ్గిన తరువాత ఎలాంటి లక్షణాలు లేకపోయినా కూడా కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు రాజమౌళి ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు. దీంతో ఒక్కసారిగా ఆ ట్వీట్ వైరల్ అయ్యింది.

సెలబ్రెటీస్ ట్వీట్స్
ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రెటీస్ కూడా రాజమౌళి త్వరగా కొలుకోవలని ప్రార్థిస్తున్నారు. హీరోల నుంచి హీరోయిన్స్ వరకు ప్రతి ఒక్కరు ఆయన త్వరగా కొలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు. ఇక విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం చాలా డిఫరెంట్ గా స్పందించాడు. ఒక వైపు సరదాగా సెటైర్ వేస్తూనే మరోవైపు త్వరగా కొలుకోవాలని కోరుకున్నారు.

బాహుబలిని పిలవండి..
సర్..మీ సైనుకుడైన బహుబలిని పిలవండి. అతనితో కరోనాను ఒకసారి తన్నించండి అంటూ సరదాగా ట్వీట్ చేసిన రామ్ గోపాల్ వర్మ మళ్లీ వెంటనే ఆయన త్వరగా కొలుకోవాలని అన్నారు. త్వరలోనే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ కొలుకుంటారని ఆశిస్తున్నట్లు వర్మ చెప్పిన విధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recommended Video

బండ్ల గణేష్ సూచనలు
ఇక మరోవైపు బండ్ల గణేష్ కూడా రాజమౌళి చెప్పిన విధానంపై స్పందిస్తూ గత అనుభవంతో కొన్ని సూచనలు ఇచ్చారు.
'హ్యాపీగా ఉండండి సర్. ఏమీ అవ్వదు. ప్రతి రోజు కోడి గుడ్లు తినండి. హ్యాపీగా రెస్ట్ తీసుకోండి. మంచిగా నిద్రపోండి' అంటూ నిర్మాత బండ్ల గణేష్ రాజమౌళికి సూచనలు అందించారు. బండ్ల గణేశ్ కొన్నిరోజుల క్రితం కరోనా బారిన పడి చాలా తొందరగా కోలుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











