నేను కమ్మకాదు, రెడ్డిని కాదు...రామ్ గోపాల్ వర్మ
నేను కమ్మకాదు, రెడ్డి కాదు. నేను టీడీపీకి కాని, కాంగ్రెస్‌కు కాని, అసలు ఏ పార్టీకి కానీ చెందిన వాణ్ణి కాదు. సో...నా ఇష్టం, అయిష్టం అన్నవి ఇక్కడ ప్రతిబింబించదు. రెండు వర్గాల వారిని స్వయంగా కలిసి తీసిన సినిమా మాత్రమే...అంటున్నారు రామ్ గోపాల్ వర్మ. ఆయన తాజా చిత్రం 'రక్త చరిత్ర' ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడారు. మీకు తెలిసింది, తెలుసుకున్నది యధాతథంగా కాకుండా ఎక్కడా మీ ఆసక్తిని జొప్పించి లేదా మీ అభిరుచికి అనుగుణంగా మార్చి, 'రక్త చరిత్ర'లో చూపెట్టలేదని గ్యారంటీ ఏమిటి? అన్న ప్రశ్నకు పై విధంగా స్పందించారు.
అలాగే తనకు ఈ చిత్రం చేయాలనిపించటానికి కారణం వివరిస్తూ...నా సినిమాల్లో 'శివ' నుంచి అటువంటి కథా వస్తువులు తీసుకోవడం అలవాటు. దేవినేని మురళి, రంగా, దావూద్ ఇబ్రహీం, చోటా చేతన్...లాంటి వ్యక్తుల జీవితాలకు ప్రేరణ చెంది కొన్ని సినిమాలు తీయడం జరిగింది. అయితే వారందరికన్నా ఎక్కువ ఆసక్తికరంగా అన్పించాయి రవి, సూరిల జీవితాల్లోని ఘట్టాలు, సంఘటనలు, కొన్ని సన్నివేశాలు! చాలామందికి రవి, సూరిల మధ్య వైరం, ఫ్యాక్షన్ నేపథ్యం వారి జీవితమని, రామానాయుడు స్టూడియో దగ్గర రవిని చంపడం కోసం జరిగిన కారు బాంబు సంఘటన...ఇలా కొన్ని మాత్రమే ఎక్కువమంది ప్రజలకు తెలుసు.
కానీ అసలు వారి జీవితాలు ఎలా సాగాయి? ఇద్దరి మధ్య ఎందుకు సంఘర్షణ చోటు చేసుకుంది..? ఆ మధ్యలో జరిగిం దేమిటి..? అన్నది 'రక్త చరిత్ర' చెబుతోంది. పోలీసుల పరిశోధన సమాచారం, రవి, సూరిల గురించి స్వయంగా చెప్పిన కొందరు వ్యక్తుల ఇన్‌ఫర్‌మేషన్, చంపబడిన వ్యక్తుల గురించి...చాలా విషయాలు నేను స్వయంగా తెలుసుకుని సినిమాలో పెట్టాను అన్నారు. ఇక ఈ చిత్రంలో ఒకరు హీరో, ఒకరు విలన్, ఒకరు కమెడియను, ఒకరు కేరక్టరు ఆర్టిస్టు అని ఉండరు. రేపు సినిమా చూస్తే మీకే తెలుస్తుంది అన్నారు. అలాగే పరిటాల రవి, సూరి ఇద్దరూ నాకు కొడుకుల్లాంటివాళ్లు. కథ 'అమ్మ' అయితే డైరక్టరు 'నాన్న', కేరక్టర్లు కొడుకులవుతారు. అందుకని ఏ కొడుకంటే ఎక్కువ ఇష్టమని అడిగితే ఏ తండ్రీ చెప్పలేడు.


Click it and Unblock the Notifications











