హాట్ టాపిక్ గా మారిన వర్మ కామెంట్స్
హైదరాబాద్ : ఎప్పుడూ ఏదో ఒక టాపిక్ తో వార్తల్లో ఉండే సంచలన దర్శకుడు రామ్ గోపాల్‌వర్మ. ఆయన నిత్యం ఏదో విషయంపై కామెంట్లు చేస్తూ ట్విట్టర్ లో తనదైన శైలిలో పోస్ట్ చేస్తూ అందరిలో ఆసక్తిని రేపుతూంటారు. తాజాగా ఆయన ‘‘ఐ'' ట్రైలర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు ఇప్పటి నుంచి శంకర్ అభిమానిగా మారిపోయాను అంటూ ట్వీట్ చేశాడు.
వర్మ ట్వీట్స్ ఏమిటంటే... ‘‘ఐ'' ‘ట్రైలర్ చూసిన తర్వాత ఒక సాధారణ వ్యక్తిగా ఆలోచిస్తే..తమిళనాడులో రజనీకాంత్, జయలలిత కంటే శంకర్ చాలా గొప్పగా అనిపించాడు. ఇప్పటి వరకూ నేను రజనీకాంత్ అభిమానిగా ఉన్నాను..కానీ ఇప్పుడు శంకర్ అభిమానిగా మారిపోయాను. అంటూ ట్వీట్ చేశారు.
‘ఇప్పుడే శంకర్ ‘ఐ' సినిమా ట్రైలర్ చూశాను. ఈ సంక్రాంతి శంకర్ రాత్రి అనడంలో ఎటువంటి సందేహం లేదు. కేవలం మొద్దులు మాత్రమే తమ సినిమాలను సంక్రాంతికి విడుదల చేస్తారు. తమిళనాడులో రజినీకాంత్, జయలలిత కంటే శంకర్ చాలా గొప్పవాడు' . శంకర్ ‘ఐ' రిలీజైతే ఫస్ట్ డే కలెక్షన్స్ రజనీ లింగను మించిపోతుంది. అందుకే నేను రజనీ కంటే శంకర్ గొప్పొడు అంటున్నాను

.ఒకవేళ శంకర్ గనుక అమీర్ ఖాన్ తో సినిమా తీస్తే అది ఇండియన్ ‘అవతార్' అవుతుంది. రజినీకాంత్ వీరాభిమాని అయిన నేను ఇప్పుడు శంకర్ అభిమానిగా మారిపోయా. హిందీలో షారుఖ్, సల్మాన్, అమీర్ ఖాన్ ల స్టార్ ఇమేజ్ పై దర్శకులు ఆధారపడుతుంటే, ఇక్కడ శంకర్ రజినీకాంత్ వంటి స్టార్ హీరోల ఇమేజ్ ను నాశనం చేస్తున్నాడు. నా జోస్యం నిజమైతే ‘ఐ' సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ‘లింగ' సినిమా కలెక్షన్స్ ను బ్రేక్ చేస్తాయి. అంటూ వర్మ ట్వీట్టర్‌లో పోస్ట్ చేశాడు.


Click it and Unblock the Notifications











