twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను కూడా ఆంధ్రోన్నే... అలా చేయడం కరెక్ట్ కాదు, భగ్గుమన్న రామ్ గోపాల్ వర్మ!

    |

    Recommended Video

    Ram Gopal Varma About Tiger KCR Andhroda Song Issue || Filmibeat Telugu

    ''మా బాష మీద నవ్వినవ్.. మా ముఖాల మీద ఊసినవ్... మా బాడీల మీద నడిచినవ్ ఆంధ్రోడా... వస్తున్నా.. వస్తున్నా.. నీ తాట తీయడానికి వస్తున్నా..'' అంటూ రామ్ గోపాల్ వర్మ ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి మీద తీయబోయే బయోపిక్ 'టైగర్ కేసీఆర్' సంబంధించిన పాట పాడి సెన్సేషన్ క్రియేట్ చేశారు.

    రెండు రోజుల క్రితం ఆర్జీవీ తన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం ప్రెస్ మీట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిలో నిర్వహించేందుకు వెళ్లగా... పోలీసులు ఆయనను నగరంలోకి రాకుండా అడ్డుకుని రిటర్న్ ప్లైట్లో హైదరాబాద్ పంపించారు. పోలీసులు అలా చేయడానికి కారణం 'నీ తాట తీయడానికి వస్తున్నా ఆంధ్రోడా..' అంటూ వర్మ పాడిన పాట కూడా ఓ కారణమట.

    రామ్ గోపాల్ వర్మ మీద ఆంధ్ర వారు ఆగ్రహంగా

    రామ్ గోపాల్ వర్మ మీద ఆంధ్ర వారు ఆగ్రహంగా

    ఆ పాట పాడిన తర్వాత చాలా మంది ఆంధ్రా ప్రాంతం వారు వర్మ మీద కోపంగా ఉన్నారని, ఆయన ఏపీలో అడుగు పెడితే దాడి చేస్తా అంటూ సోషల్ మీడియా ద్వారా హెచ్చరించారని... ఇలాంటి సమయంలో రామ్ గోపాల్ వర్మ విజయవాడలో కనిపిస్తే వారు మరింత ఉద్రేకానికి గురయ్యే అవకాశం ఉందనేది పోలీసుల వాదన.

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌'తో మరింత రెచ్చగొట్టాడు

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌'తో మరింత రెచ్చగొట్టాడు

    ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు వర్మ సోషల్ మీడియా ద్వారా చేసిన రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సమయంలో ఆయన ప్రెస్ మీట్ పెడితే విజయవాడలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అంటున్నారు. తనను అడ్డుకోవడం వెనక ఇలాంటి కారణాలు చెప్పడంపై వర్మ స్పందించారు.

    నేను కూడా ఆంధ్రావాడినే కదా..

    నేను కూడా ఆంధ్రావాడినే కదా..

    ‘‘నేను ఒక ఫిల్మ్ మేకర్. ఆ పాట పాడింది ‘టైగర్ కేసీఆర్' అనే చిత్రం ఫస్ట్ లుక్ గురించి... అది తెలంగాణ లీడర్ కేసీఆర్ బయోపిక్ గురించి తీస్తున్నదాంట్లో భాగంగా ఆయన అప్పుడు అనుకున్న ఎమోషన్ కాంటెక్ట్స్ చేస్తూ చేశాను. మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవడైనా నేను ఆంధ్రోడికి వార్నింగ్ ఇచ్చాడని అనుకుంటారా? నేను కూడా ఆంధ్రావాడినే కదా...'' అని వర్మ వ్యాఖ్యానించారు.

    ఒక వేళ అలాంటి పరిస్థితి ఉంటే రక్షణ కల్పించాలి

    ఒక వేళ అలాంటి పరిస్థితి ఉంటే రక్షణ కల్పించాలి

    ప్రతి రోజూ మీడియాలో ఎవరో ఒకరు ఇంకొకరిని తిడుతూనే ఉంటారు. ఇలా అన్నవారికి సెక్యూరిటీ సమస్య ఉంటుందని రాకుండా ఆపేస్తారా? ఒక వేళ అలాంటి పరిస్థితి ఉంటే రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత. ఇలా అడ్డుకుని ఏకంగా ఏపీలో అడుగు పెట్టకుండా చేయడం ఏమిటి? అని వర్మ ప్రశ్నించారు.

    ఆ విషయంలో వివాదం లేదు, కానీ...

    ఆ విషయంలో వివాదం లేదు, కానీ...

    సెక్షన్ 144, సెక్షన్ 30 అమలులో ఉంది కాబట్టి పైపుల రోడ్డులో నా ప్రెస్ మీట్ పెట్టకుండా అడ్డుకోవడాన్ని నేనేమీ తప్పుబట్టడం లేదు. కానీ నేను విజయవాడ రాకుండా, ఏదైనా హోటల్‌, లేదా నా స్నేహితుడి ఇంటికి కూడా వెళ్లుకండా అడ్డుకోడాన్ని తాను ప్రశ్నిస్తున్నట్లు వర్మ తెలిపారు.

    English summary
    Ram Gopal Varma about Tiger KCR Andhroda song issue. RGV has promoting the film Tiger KCR. RGV has sung a song typical controversial song which reads thus, 'Ma bhasa meeda navvi naavu, maa mukhala meeda usi naavu, maa bodila meeda nadisaanavu andhroda'. He further added, 'Vasthunna..vasthunna..ni tata teyaniki vasthunna.'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X