For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  శ్రీను వైట్లను మందలించిన వర్మ

  By Srikanya
  |

  దూకుడు చిత్రం సూపర్ హిట్ కావటంతో జోరు మీద ఉన్న దర్శకుడు శ్రీను వైట్ల రీసెంట్ గా మహేష్ బాబు ముంబైలో ఇచ్చిన పార్టికి హాజరయ్యాడు. ఆ పార్టిలో రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాధ్, హీరో ప్రభాస్ మరికొద్ది మంది పాల్గొనటం జరిగింది. అక్కడ ముఖ్యంగా దూకుడు చిత్రం రికార్డుల గురించే టాపిక్ నడిచింది. అప్పుడు శ్రీను వైట్ల దూకుడు చిత్రం కలెక్షన్స్ ని మిగతా తెలుగు హిట్స్ రికార్డులతో పోల్చి చెప్పటం ప్రారంభించారు. దాంతో వర్మ దాన్ని అడ్డుకుని... ఈ కామిడీ సినిమాని వేరే ఢిపెరెంట్ జనర్స్ తో వచ్చిన మిగతా సినిమాలతో పోల్చవద్దని మందలించారంటూ ఓ ఇంగ్లీష్ డైలీ కథనం రాసుకొచ్చింది. ఇక ప్రబాస్ సైతం ఈ స్టార్ డైరక్టరని పొగడ్తల్లో ముంచెత్తాడు. పూరీ మాత్రం సెలైంట్ గా ఉండి చూస్తూ,వారి మాటలను వింటూ ఉన్నారు. ఇక ఎవరు కాదన్నా అవునన్నా..దూకుడు మాత్రం సెన్సెషనల్ హిట్ అనేది మాత్రం నిజం. అది ఇండస్ట్రీ మొత్తం ఒప్పుకున్న సత్యం. పోకిరి,మగధీర చిత్రాల రికార్డులతో కాదన్నా కూడా పోల్చి చూస్తారు. అలాగే దూకుడు చిత్రం కేవలం కామిడీ సినిమా మాత్రమే కాదు. అందులో తండ్రి కొడుకుల సెంటిమెంట్,యాక్షన్ సీన్స్ కూడా హైలెట్ అయ్యే రీతిలో ఉండి సినిమాని నిలబెట్టబట్టే ఆ రేంజి సక్సెస్ ని సినిమా చూడగలిగింది.ఇదంతా కేవలం శ్రీను వైట్ల ప్రతిభ మాత్రమే. తెలుగు సినిమాని రికార్డుల పరంగా ఓ రేంజి సక్సెస్ ను చూసిన దర్శకుడుగా ఇప్పుడు ఆయన టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. త్వరలోనే హిందీ చిత్రం కూడా డైరక్షన్ చేసే అవకాసం ఉంది.

  "దూకుడు స్క్రిప్ట్ అనుకున్నప్పుడే పెద్ద సక్సెస్ అవుతుందని అనుకున్నాం. కానీ ఈ స్థాయిని మాత్రం ఊహించలేదు. కథ వినగానే మహేష్ 'ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్ బిలీవబుల్' అని అన్నారు. మహేష్‌ను ఇంతవరకు ఎవరూ చూపించని విధంగా తెరమీద ప్రెజెంట్ చేయాలని అనుకుంటున్నప్పుడు నా కళ్ళ ముందు తెల్లటి చొక్కా, పులిగోరు చెయిన్‌తో మహేష్ ఎమ్మెల్యే గెటప్‌లో కనిపించాడు. దాన్నే తెరమీద చూపించాం. ఇంకో రోజు ట్రెడ్‌మిల్ చేస్తుంటే 'దూకుడు' అనే టైటిల్ స్ఫురించింది. ఇందులోని ప్రతి సీనూ, ప్రతి డైలాగూ మహేష్‌ను దృష్టిలో పెట్టుకుని రాసినవే అన్నారు దర్శకుడు శ్రీను వైట్ల.మహేష్, సమంత నటించిన 'దూకుడు' ఇటీవల విడుదలై పరిశ్రమ రికార్డుల్ని బద్ధలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం విదితమే. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే "దూకుడు పెద్ద విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ స్థాయిని నిలబెట్టుకోవాలనే టెన్షన్ కూడా ఉంది'' అని అంటున్నారు శ్రీనువైట్ల. ఇక ప్రస్తుతం మహేష్ ది బిజెనెస్ మ్యాన్ షూటింగ్ లో బిజిగా ఉన్నారు. ఈ చిత్రం క్లైమాక్స్ కోసం ఆయన గోవా వెళ్తున్నారు.

  English summary
  “You can’t compare this comic-caper with other hits since they were from different genres,” Ram Gopal Varma reminded Srinu Vytla.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X