ఏపీ సీఎం వైఎస్ జగన్‌‌కు ఆర్జీవీ హెచ్చరిక... వాళ్ళతో జాగ్రత్త.. డేంజరస్ అంటూ!

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలపై గత కొన్ని రోజుల పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంలో ఊహించని విధంగా వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఎంటర్ కావడంతో ఇది ఇంకా హాట్ టాపిక్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

వరుస ట్వీట్స్‌ తో

వరుస ట్వీట్స్‌ తో

ఏపీ ప్రభుత్వం పై వరుస ట్వీట్స్‌ తో ఆర్జీవీ విరుచుకుపడిన సంగతి తెలిసిందే. టికెట్ ధరల విషయం పై ఏపీ మంత్రి పేర్ని నానికి రామ్ గోపాల్ వర్మకు మధ్య ఒక ఛానల్ లైవ్ డిబేట్ లో మాటల యుద్ధం జరిగింది. ఆ తరవాత ఆర్జీవీ నా పది ప్రశ్నలు అంటూ ఓ వీడియో ద్వారా ప్రశ్నలు సంధించారు. ఆ తర్వాత కూడా వరుసగా ట్వీట్లు వేసి వర్మ రచ్చ చేశారు.

ప్రభుత్వ పరిధిలోకి రాదని

ప్రభుత్వ పరిధిలోకి రాదని

దానికి పేర్ని నాని కూడా స్పందించారు. ఆర్జీవి ట్వీట్లకు ఒక్కో ట్వీట్ కి ఆయన అడిగిన సమాధానమిచ్చారు. టికెట్ ధరలు తగ్గించడం వలన హీరోల రెమ్యూనరేషన్ తగ్గదని, అదే సమయంలో క్వాలిటీ తగ్గుతుందని, నిర్మాతలకు సినిమాలు తీయాలనే ఆసక్తి పోతుందనేది వర్మ వాదన. అసలు సినిమా అనేది నిత్యావసర వస్తువు కానప్పుడు.. ధరలపై నియంత్రణ ప్రభుత్వ పరిధిలోకి రాదని ఆయన అంటున్నారు.

జగన్ ను టార్గెట్ చేస్తూ

జగన్ ను టార్గెట్ చేస్తూ


కానీ సినిమాటోగ్రఫీ చట్టం మేరకు మేము ముందుకు వెళ్తామని మంత్రి అంటున్నారు. అయితే ఇద్దరూ త్వరలో కలవాలని అనుకున్నారు. దీంతో వర్మ ఈ విషయాన్ని లైట్ తీసుకుంటాడని అందరూ అనుకున్నారు. కానీ సైలెంట్ అయినట్లు అయిన వర్మ మళ్ళీ ట్వీట్లు చేశారు. అయితే ఈసారి వర్మ మంత్రులను కాకుండా జగన్ ను టార్గెట్ చేస్తూ కొన్ని ట్వీట్లు చేశారు.

వైసీపీ నేతలతో జాగ్రత్త

వైసీపీ నేతలతో జాగ్రత్త

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన ఆయన మీ చుట్టూ వైసీపీ నేతలతో జాగ్రత్త అంటూ హెచ్చరించారు. వైసీపీ నేతలు సీఎం జగన్‌ను తప్పు దారి పట్టిస్తున్నారంటూ పేర్కొన్నారు. వైసీపీ నేతలు సీఎం జగన్ చుట్టూ ఉంటూనే తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన్ను తప్పుదారి పట్టిస్తున్నారని వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

మీరు ఒక్కరే వైఎస్ జగన్

మీరు ఒక్కరే వైఎస్ జగన్

''వైసీపీలో నేను ప్రేమించే, అభిమానించే వ్యక్తి మీరు ఒక్కరే వైఎస్ జగన్, వ్యక్తిగతంగా మీరంటే నాకు అభిమానం. అయితే మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ ప్రయోజనాలు, ఇగోల కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. వాళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ శ్రేయోభిలాషిగా నా సలహా ఇదే'' అని ట్వీట్ చేశారు.

పరోక్షంగా వారిని ఉద్దేశించే

పరోక్షంగా వారిని ఉద్దేశించే

అయితే పరోక్షంగా టికెట్ ధరల తగ్గింపు నిర్ణయం సీఎం జగన్ తీసుకున్నది కాదని, పార్టీ లోని కొందరు నేతలు తమ వ్యక్తిగత పగలు, ప్రయోజనాల కోసం ఆయనను ప్రేరేపిస్తున్నారు అని వర్మ చెప్పినట్టు అనిపిస్తోందని అంటున్నారు. వర్మ చేసిన ఈ ట్విట్‌స్తో ఏపీ రాజకీయాల్లో మళ్ళీ చర్చనీయాంశం అయింది. మారింది. గత కొన్ని రోజులుగా వర్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పలువురిని ఉద్దేశించే ఈ ట్వీట్ చేశారంటూ భావిస్తున్నారు. మరి చూడాలి ఏం జరగబోతోంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X