RRR క్రేజ్ ను వాడుతూ స్టార్ హీరోతో సినిమా ప్రకటించిన వర్మ.. సినిమా పేరు ఏంటో తెలుసా?
ఒకప్పుడు వర్మ సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక కొత్త అంశం ఉండేది. ఒక సినిమా అని కాదు కానీ చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక విషయాన్ని హైలైట్ చేస్తూ ఉండేవాడు. అయితే అలాంటి దర్శకుడు కొంత కాలంగా వివాదాస్పద సినిమాలు మాత్రమే చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలో 'బోల్డ్' కంటెంట్‌నే ప్రధాన అంశంగా సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో డీ గాంగ్ అంటూ ఒక సినిమాతో ముందుకు వచ్చారు కానీ అది పెద్దగా ఆకట్టుకోలేదు. ఇప్పుడు ఆయన ఓ సెన్సేషనల్ హీరోతో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. ఆయన మరెవరో కాదు.. కన్నడ స్టార్ 'ఉపేంద్ర'.

తెలుగు వారికి కూడా
కన్నడనాట తరగని క్రేజ్ సొంతం చేసుకున్న ఉపేంద్ర. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా సినీ ప్రియులను మెప్పించాడు. ఒక రకంగా మనకు తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎంత క్రేజ్ ఉందో కన్నడ నాట ఉపేంద్రకు అంత క్రేజ్ ఉంది. ఆయన కన్యాదానం, 'ఉపేంద్ర, ఒకే మాట, రా!, నీతోనే ఉంటాను, టాస్, సెల్యూట్, సన్నాఫ్ సత్యమూర్తి వంటి తెలుగు చిత్రాల్లో హీరోగా, కొన్ని కీలక పాత్రల్లోనూ నటించి తెలుగు వారికి కూడా దగ్గరయ్యాడు.

కీలక పాత్రలో
త్వరలో విడుదల కానున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతోన్న 'గని'లోనూ ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. అయితే చాలా కాలంగా ఉపేంద్ర సింగిల్ హీరోగా సాలిడ్ హిట్ పడలేదు. దీంతో ఆయన సరైన స్క్రిప్టు దొరికితే పని చేసేందుకు ఎదురుచూస్తున్నారు. అయితే అలాంటి సమయంలోనే దర్శకుడు ఆర్‌జీవీ చెప్పిన కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలా రామ్ గోపాల్ వర్మ ఉపెంద్రతో యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు శ్రీకారం చుట్టారు.

గత ఏడాది ప్రకటన
గత ఏడాది ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా ఆయనకు విషెస్ చెప్పిన ఆర్జీవి.. త్వరలోనే ఆయనతో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రకటన కూడా చేశారు. తమ కాంబినేషన్‌లో అదిరిపోయే సినిమా వస్తుంది అంటూ ఆయన అప్పట్లో వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే వస్తాయి అంటూ ఆయన ప్రకటించాడు.

లేదనుకున్నా
ఆ తర్వాత వర్మ నుంచి గానీ ఉపేంద్ర నుంచి గానీ ఎలాంటి ప్రకటనలు లేకపోవడంతో ఈ సినిమా పట్టా లెక్కక ముందే అయిపోయింది అనుకున్నారు. కానీ గురువారం నాడు RRR క్రేజ్ వాడుకుంటూ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన చేశారు. గురువారం వర్మ ఉపేంద్ర సినిమా మోషన్ టీజర్ ని షోషల్ మీడియా ట్వీట్టర్ వేదికగా విడుదల చేశారు. అలాగే ' అనే టైటిల్ ని ఫిక్స్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది.
Recommended Video


R గ్యాంగ్
బెంగళూరులో కలకలం సృష్టించిన 'R' గ్యాంగ్ దుబాయ్ లో వున్న డీ కంపెనీ అధినేత అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంని కూడా వణికించిందట అలాంటి 'R' పాత్రలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నాడని వర్మ ప్రకటించారు. 'R' ఓ గ్యాంగ్ స్టర్ లా కాకుండా చిన్న టైమ్ స్ట్రీట్ ఫైటర్ గా ప్రారంభించి ఆపై బెంగళూరులోనే కాకుండా ముంబైలోని మాఫియాను దుబాయ్ లో వున్న డీ కంపెనీని కూడా భయభ్రాంతులకు గురిచేశాడట. అలాంటి హడలెత్తించిన 'R' పాత్రలో ఉపేంద్ర నటిస్తున్నాడని వర్మ వెల్లడించారు.


Click it and Unblock the Notifications











