రామ్ గోపాల్ వర్మ మరో సంచలనం: కేసీఆర్ బయోపిక్... టైటిల్ ఏంటో తెలుసా?

ఎన్టీ రామారావుకు జీవితానికి సంబంధించి 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం తీసి సెన్సేషన్ క్రియేట్ చేసిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ... ఈ చిత్రంలో చంద్రబాబును విలన్‌గా చూపించాడనే విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించిన జ్వాలలు ఇంకా ఆరకముందే వర్మ మరో సంచలన బయోపిక్ అనౌన్స్ చేశాడు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా ఇందుకు సంబంధించిన టైటిల్‌ లోగో విడుదల చేశారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింంది.

టైగర్ కేసీఆర్

‘టైగర్ కేసీఆర్' పేరుతో ఈ చిత్రం రాబోతోంది. ‘ది అగ్రెసివ్ గాంధీ అనేది' సబ్ క్యాప్షన్. తెలంగాణ కోసం కేసీఆర్ చేసిన పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు' అంటూ టైటిల్ పోస్టర్ మీద పేర్కొనడం ద్వారా ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనేది చెప్పకనే చెప్పారు ఆర్జీవీ.

తెలంగాణ ప్రజలకు థర్డ్ క్లాస్ ట్రీట్మెంట్ భరించలేక

తెలంగాణ ప్రజలకు థర్డ్ క్లాస్ ట్రీట్మెంట్ భరించలేక

ఈ సినిమా కేటీఆర్ ఫాదర్ బయోపిక్. ఆంధ్రా వారు తెలంగాణ వారికి థర్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇవ్వడాన్ని భరించలేక పోయిన ఆయన ఎలా పోరాటం చేశారు, తెలంగాణ ఎలా సాధించారు అనే కాన్సెప్టుతో ఈ చిత్రం ఉంటుందని వర్మ తెలిపారు.

ఇందులో కూడా చంద్రబాబు పాత్ర ఉంటుందా?

ఇందులో కూడా చంద్రబాబు పాత్ర ఉంటుందా?

కేసీఆర్ బయోపిక్ అంటే అందులో చంద్రబాబు పాత్ర కూడా ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 1999లో చంద్రబాబు తన మంత్రి వర్గంలో స్థానం కల్పించక పోవడంతో తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుందనే అసంతృప్తితో కేసీఆర్ టీడీపీ నుంచి బయటకు వచ్చి 2001లో ప్రత్యేక రాష్ట్ర నినాదంతో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే.

త్వరలో పూర్తి వివరాలు

త్వరలో పూర్తి వివరాలు

ఈ చిత్రంలో కేసీఆర్ పాత్రలో ఎవరు నటిస్తారు? ఇతర వివరాలు ఏమిటి అనేది త్వరలో రామ్ గోపాల్ వర్మ వెల్లడించనున్నారు. మరి ఈ సినిమాపై కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ వర్గాలు ఎలా స్పందించబోతున్నారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X