twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RGV మరో సంచలనం.. సీమ అయింది ఇక తెలంగాణ రక్తచరిత్ర.. 'కొండా' అంటూ!

    |

    ఒకప్పుడు ట్రెండీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వర్మ ఇప్పుడు ఎక్కువగా వివాదాస్పద అంశాల చుట్టూనే తిరుగుతున్నాడు. వివాదాస్పద సినిమాలను చేస్తూ ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్ లను టచ్ చేస్తూ వెళుతున్న వర్మ ఇప్పుడు తెలంగాణకు చెందిన ఒక కీలక రాజకీయ నేత గురించి బయోపిక్ చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. కొద్ది రోజుల ముందు రామ్ గోపాల్ వర్మ వరంగల్ లో సీక్రెట్ గా పర్యటనకు వెళ్లడంతో కొండా సురేఖ దంపతుల మీద బయోపిక్ చేయవచ్చని అంచనాలు వెలువడ్డాయి. ఎట్టకేలకు అదే నిజమైంది. ఆ విషయాన్ని స్వయంగా ధ్రువీకరించారు ఆ వివరాల్లోకి వెళితే

    రాజకీయాల్లో కీలకంగా

    రాజకీయాల్లో కీలకంగా

    తెలంగాణ రాజకీయాలలో కీలక పాత్ర పోషించిన కొండా సురేఖ ఆమె భర్త కొండా మురళి ల జీవిత చరిత్ర గురించి తెలంగాణలో కూడా చాలా తక్కువ మందికి తెలుసు. నిజానికి ఒకప్పుడు తెలుగు దేశంలో ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు అనుచరుడిగా ఎదిగిన కొండా మురళి రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అండతో ఎమ్మెల్యేగా గెలిచిన కొండా సురేఖ ఆ తర్వాత మంత్రిగా కూడా పనిచేశారు. ఒకప్పుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి వెనుక నడిచిన ఈ కొండా కుటుంబం ఆ తర్వాత జగన్ కు దన్నుగా నిలిచారు.. రాష్ట్ర విభజన ఈ సమయంలో వైఎస్ జగన్ సమైక్యాంధ్రకు మద్దతు తెలపడం తో పాటు జగన్ తో ఏర్పడిన కొన్ని విభేదాలు నేపథ్యంలో కేసీఆర్కు దగ్గరైన ఈ కొండా కుటుంబం మళ్లీ తమ సొంత కాంగ్రెస్ గూటికి చేరారు. అయితే కేవలం రాజకీయ నాయకులు గానే వీరు యావత్ తెలుగు రాష్ట్రాలకు పరిచయం కానీ కొండ మురళి ఉద్యమ చరిత్ర గురించి రామ్ గోపాల్ వర్మ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు.

    నాకు అవే తెలుసు

    నాకు అవే తెలుసు

    కొండా మురళి బయోపిక్ అంటూ కొండ మురళి, కొండా సురేఖ అలాగే మావోయిస్టు ఆర్కే అలియాస్ రామకృష్ణ పాత్రలు కీలకంగా ఉంటాయని చెబుతూ రామ్ గోపాల్ వర్మ ఒక వాయిస్ విడుదల చేశారు. తాను విజయవాడలో చదువుకోవడం వల్ల అక్కడి రౌడీయిజం గురించి రౌడీల గురించి తెలుసు అని రామానాయుడు స్టూడియోలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కారణంగా రాయలసీమ ఫ్యాక్షనిజం గురించి కూడా తెలిసిందని వర్మ చెప్పుకొచ్చారు.

     అత్యద్భుతమైన ప్రత్యేక అనుబంధం

    అత్యద్భుతమైన ప్రత్యేక అనుబంధం

    తెలంగాణ సాయుధ పోరాటం గురించి తనకు పెద్దగా తెలియదు అని పేర్కొన్న వర్మ ఈ మధ్య అనుకోకుండా తనను కలిసిన కొందరు మాజీ నక్సలైట్లు అప్పటి పోలీసు అధికారులతో మాటా మంతీ నేపథ్యంలో ఈ సాయుధ పోరాటం గురించి తనకు ఒక అవగాహన వచ్చింది అని చెప్పుకొచ్చాడు. ఈ వ్యవహారం మొత్తం మీద తనను ఒక విషయం ఆకర్షించిందని చెబుతూ అది ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్ లో చంపబడిన ఆర్.కె అలియాస్ రామకృష్ణకు కొండా మురళి కి ఉన్న ఒక అత్యద్భుతమైన ప్రత్యేక అనుబంధం అంటూ వర్మ చెప్పుకొచ్చారు.

     చెప్పాడు

    చెప్పాడు

    ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు అప్పటి స్థితి గతులను సినిమాటిక్ గా క్యాప్చర్ చేయడానికి కావలసిన సమాచారం ఇవ్వమని తాను కొండా మురళిని కలిసి అయితే ఈ సినిమా తీయడం వెనుక ఉన్న తన ఉద్దేశం నచ్చి కొండా మురళి కూడా ఆ విషయాలు షేర్ చేసుకోవడానికి అంగీకరించారు అని వర్మ ప్రకటించారు. కొందరు పెత్తందారుల పెత్తనం భరించలేక బడుగు బలహీన వర్గాల మొత్తం తిరగబడి పోరాటం చేస్తున్న రోజుల్లో తిరగబడిన వారిపై ఉక్కుపాదం మోపి తొక్కి వేయడానికి ప్రయత్నాలు చేసినా తిరుగుబాటు జరుగుతూనే ఉండేది అని అలాంటి తిరుగుబాటుకు కొండా మురళి, ఆర్కే నాయకత్వం వహించారని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. విపరీత పరిస్థితుల నుంచి విపరీతమైన వ్యక్తులు ఉద్భవిస్తారు అని 180 ఏళ్ల క్రితం కార్ల్ మార్క్స్ చెప్పినట్లు గా అలాంటి విపరీత పరిస్థితుల నుంచి పుట్టిన వారి కొండా మురళి అని అని వర్మ వెల్లడించారు.

    ఇది సినిమా కాదు

    ఇది సినిమా కాదు

    అలాగే ఇప్పుడు తన తీస్తున్నది ఒక సినిమా కాదని చెబుతూ నమ్మశక్యం కాని కొన్ని నిజ జీవితాల ఆధారంగా తెలంగాణలో జరిగిన ఒక రక్త చరిత్ర అంటూ 95 లో జరిగిన ఆ చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాలను సైతం కురుస్తూనే ఉన్నాయి అని రాం గోపాల్ వర్మ తన వాయిస్ లో పేర్కొన్నారు. ఇక ఈ కొండా సినిమా షూటింగ్ పూర్తిగా వరంగల్ పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో జరగబోతోందని అతి త్వరలో ఈ సినిమా ప్రారంభం కాబోతోంది అంటూ వర్మ ప్రకటించారు. అయితే ఈ మధ్య కాలంలో చేస్తున్న ప్రతి సినిమాను కాంట్రవర్సీ గా మారుస్తున్న ఈ సినిమాను కూడా అంత తేలికగా వదిలే ఉద్దేశాలు లేవని సినీ పండితులు భావిస్తున్నారు. మరి చూడాలి వర్మ ఈ సినిమాలో తెలంగాణ ఏ మేరకు ప్రజల్లోకి తీసుకు వెళ్ళగలరు అనేది. ఇక వర్మ గతంలో తీసిన వంగవీటి, రక్త చరిత్ర సినిమాలు మంచి పేరు తెచ్చుకోగా ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉండనుంది అనేది.

    English summary
    Ram Gopal Varma Announces Konda Murali Biopic named 'konda'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X