క్లైమాక్స్ దెబ్బకొట్టినా తగ్గలేదు.. మరో నగ్న సినిమాకు సిద్దమైన వర్మ!

టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఎలాంటి కంటెంట్ తో హడావుడి చేస్తున్నాడో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఒక సినిమా ప్లాప్ అయితే మళ్ళీ పార్ట్ 2 తీస్తాను అని కౌంటర్ ఇచ్చే వర్మ ఈసారి మళ్ళీ అదే తరహాలో ప్రమోషన్స్ లో భాగంగా మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. నగ్నం అనే కొత్త కాన్సెప్ట్ ని వధలబోతున్నాడట.

క్లైమాక్స్ ఫెయిల్..

క్లైమాక్స్ ఫెయిల్..

ఇటీవల రామ్ గోపాల్ వర్మ తన మొదటి సినిమాను డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అడల్ట్ యాక్టర్ మియా మాల్కోవాతో తెరకెక్కించిన క్లైమాక్స్ అనే సినిమాను రీసెంట్ గా ఆర్జీవి వరల్డ్ పేరుతో ఒక యాప్ రిలీజ్ చేశారు. అయితే ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.

మరో నగ్న సినిమా..

మరో నగ్న సినిమా..

ఇప్పుడు నగ్న అనే మరొక సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు వర్మ. తెలుగులోనే కాకుండా ఇంగ్లీష్, హిందీ భాషల్లో క్లైమాక్స్ తరహాలోనే ఓ వర్గం ఆడియెన్స్ ని టార్గెట్ చేస్తూ వర్మ ఆ చిత్రాన్ని రిలీజ్ చేయబోటున్నాడు. క్లైమాక్స్ అయితే సక్సెస్ అయినట్లుగా బయట పెద్దగా టాక్ ఏమి రావడం లేదు. కానీ వర్మ మాత్రం ప్రచారాలు గట్టిగానే చేసుకుంటున్నాడు.

ట్రైలర్ ఎప్పుడంటే..

ట్రైలర్ ఎప్పుడంటే..

క్లైమాక్స్ సినిమా అద్భుత విజయాన్ని అందుకున్న తరువాత నెక్స్ట్ నగ్న అనే సినిమాతో రాబోతున్నట్లు చెబుతూ.. అందుకు సంబంధించిన ట్రైలర్ ని సోమవారం సాయంత్రం 5.30గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో ట్విట్టర్ లో ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమా ఎప్పుడు తీసారు సర్.. అంటూ నెటీజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Recommended Video

Climax Movie Review And Rating
సక్సెస్ అవుతుందా?

సక్సెస్ అవుతుందా?

నగ్న అనే కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఆర్జీవి ఈ సారి ఎలాంటి షాక్ ఇస్తాడో అనే కామెంట్స్ వస్తున్నాయి. అసలు ఈ రేంజ్ లో ఆర్జీవి నుంచి అడల్ట్ సినిమాలు వస్తాయని ఎవరు ఊహించలేదు. క్లైమాక్స్ సినిమా సక్సెస్ కాకపోయినప్పటికి వర్మ మాత్రం ఆ సినిమా సూపర్ సక్సెస్ అంటూ ట్వీట్ చేస్తున్నాడు. మరి నెక్స్ట్ నగ్న ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X