రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పారు
హైదరాబాద్:పొరపాట్లు చేయటం మానవ సహజం. అయితే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం ఎంత హుందాగా చేస్తారనేదానిపైనే వారి గౌరవ,మర్యాదలు ఆధారపడి ఉంటాయి. తాజాగా వర్మ తను ట్విట్టర్ ద్వారా చేసిన పొరపాటుకు క్షమాపణ చెప్పారు. ఎందుకీ క్షమాపణ..ఎవరి గురించి అంటారా...ఆయన రీసెంట్ గా ప్రముఖ దర్శకుడు ప్రముఖ దర్శకుడు బాలచందర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగానే... చనిపోయినట్లు ...అందుకు ఆయనకు సంతాపం తెలుపుతూ ట్విట్ చేశారు. అది వివాదాస్పమై అంతటా విమర్శలు ఎదుర్కొంది. అయితే వెంటనే ఆయన దాన్ని తొలిగించారు. కానీ అప్పటికే అది మీడియాలో అంతటా ప్రచారమైపోయింది. ఈ నేపధ్యంలో ఆయన క్షమాపణ చెప్పారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేస్తూ..."నేను బాలచందర్ గారి గురించి చేసిన ట్వీట్ కు క్షమాపణ చెప్తున్నాను...నేను రూమర్ కాదో చెక్ చేసుకోకండా ట్వీట్ చేసాను... ఆయన స్పీడ్ గా రికవరీ కావాలని కోరుకుంటున్నా". అని అన్నారు. గత కొద్ది రోజులుగా బాలచందర్ ఆరోగ్య పరిస్ధితేం బాగోలేదు. మీడియా మొత్తం ఈ విషయమై కేంద్రీకరించి ఉంది. హాస్పటిల్ వైద్యులు బులెటెన్స్ విడుదల చేస్తున్నారు.
ఇక ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ నగరంలోని కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్య మినహా మిగతా అన్ని అవయవాలు కుదుటపడినట్లు వైద్యులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులెటన్‌లో వెల్లడించారు. కిడ్నీలకు డయాలసిస్ చికిత్స అంది స్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.
పలువురు సినీ ప్రముఖులు బాలచందర్‌ను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. డీఎంకే నేత స్టాలిన్, విజయకుమార్, నటి కె ఆర్ విజ య, రాజేష్, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ మొదలగు పలువురు కె.బాలచందర్‌ను పరామర్శించారు. కె ఆర్ విజయ బాలచందర్‌ను చూసి బోరున విలపించారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరాలని ఆమె ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











