»   » ఫస్ట్ టైం... రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పాడు, ఎవరికి?

ఫస్ట్ టైం... రామ్ గోపాల్ వర్మ క్షమాపణ చెప్పాడు, ఎవరికి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు వివాదాలేమీ కొత్త కాదు. ఆయన ట్విట్టర్లో ప్రతి రోజూ ఎవరో ఒకరిపై కామెంట్స్ చేస్తూనే ఉంటారు. ఆయన చేసిన కామెంట్స్ వల్ల చాలా మంది స్టార్స్, వారి అభిమానులు, కొన్ని సందర్భాల్లో సాధారణ ప్రజలకు కూడా హర్టయిన సందర్భాలు అనేకం.

వర్మకు ఒకరిని తన సూటి పోటి మాటలు, విమర్శలతో నొప్పించడమే తప్ప.... క్షమాపణలు చెప్పడం తెలియదు. ఇప్పటి వరకు ఆయన ఎవరికీ క్షమాపణలు చెప్పిన సందర్భాలే లేవు. ఫస్ట్ టైం వర్మ ఒక వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. అది కూడా ఓ మహిళా జర్నలిస్టుకు. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

'వీరప్పన్' చిత్రాన్ని వర్మ ఇటీవల హిందీలో కూడా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలైన ఈ సినిమాపై నెగెటివ్ రివ్యూ రాసారు శిల్పా జామ్కండికర్ అనే జర్నలిస్టు. 'వ్యక్తి గత కారణాలతో కొందరు సినిమాను అడ్డుపెట్టుకుని ఫిల్మ్ మేకర్స్ మీద విమర్శలు చేసినపుడు...ఫిల్మ్ మేకర్స్ కూడా అదే విధంగా తిరిగి విమర్శలు చేస్తారంటూ' వర్మ తొలుత ట్వీట్ చేసారు.

అంతటితో ఆగకుండా రకరకాల విషయాలను, సామెతలను, కొన్ని సంఘటనలను గుర్తు చేస్తూ ఆమెపై విరుచుకుపడ్డారు. తర్వాత ఏమైందో తెలియదు కానీ వర్మ ఆమెకు క్షమాపణ చెప్పాడు. నా జీవితంలో తొలిసారి క్షమాపణ చెబుతున్నాను... సారీ శిల్పా అంటూ ట్వీట్ చేసారు.

English summary
Shilpa Jamkhadikar, a Journalist of Reuters India, wrote a negative review on Ram Gopal Varma's new release 'Veerappan'. In response, RGV tweeted, 'If someone becomes personal in bitching the film maker beyond the film,the film maker also in return can bitch the person beyond the film'. By sharing the picture of the Journalist, Ramu commented Veerappan is as beautiful as her face. He, however, deleted the post later and wrote, ' I never apologise but for the first time I sincerely am apologising...I just got carried away..Sorry Shilpa'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu