అర్జున్‌రెడ్డి సూపర్ ఫ్లాప్.. సందీప్‌రెడ్డికి షాకిచ్చిన వర్మ
అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి చిత్రం దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకొన్నది.
Recommended Video

అర్జున్ రెడ్డి చిత్రంతో టాలీవుడ్‌లో సంచలన విజయం సాధించాడు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి చిత్రం దేశవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖుల చేత ప్రశంసలు అందుకొన్నది. అర్జున్ రెడ్డి చిత్రం చూసిన తర్వాత దర్శకుడు సందీప్, హీరో విజయ్ దేవరకొండను ఆకాశానికి ఎత్తేశాడు. తాజాగా ఫేస్‌బుక్‌లో అర్జున్ రెడ్డి సూపర్ ఫ్లాప్ అంటూ కామెంట్ చేయడం అందర్నీ ఆశ్చర్చానికి గురిచేస్తున్నది.

పవన్ కంటే మంచి హీరో
అర్జున్ రెడ్డి చిత్రం విడుదలైన తర్వాత పవన్ కల్యాణ్ కంటే విజయ్ దేవరకొండ గొప్ప హీరో అంటూ ఆకాశానికి ఎత్తేశాడు. అంతేకాకుండా ఆయన నటన హాలీవుడ్ హీరోలకు ధీటుగా ఉంది అని కితాబిచ్చారు.

వర్మ బ్రాండ్ అంబాసిడర్‌లా
ఓ దశలో రాంగోపాల్ వర్మను చూస్తే అర్జున్ రెడ్డికి బ్రాండ్ అంబాసిడరా అనే అనుమానం కూడా కలిగింది. అంటే ఆ రేంజ్‌లో అర్జున్ రెడ్డిని సొంతంగా భుజాలపై మోశాడు. ఆ సినిమాపై వర్మ పిచ్చి క్రేజి అందరిని ఆకర్షించింది.
సందీప్‌ను చూస్తే ఈర్ష్యగా
తాజాగా అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగాపై వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. సందీప్ తన తదుపరి చిత్రానికి సంబంధించిన కథను నాకు చెప్పాడు. ఆయనను చూస్తే నాకు ఈర్ష్యగా ఉంది. కథ అంతగా నచ్చింది అని అంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్‌తో పాటు సందీప్‌తో దిగిన ఫొటోను కూడా పెట్టడం గమనార్హం.

మెగా సక్సెస్ కావడం తథ్యం
సందీప్ రెడ్డి చెప్పిన కథ ప్రకారం చూస్తే ఆ స్టోరీ ముందు అర్జున్‌రెడ్డి కథ సూపర్ ఫ్లాప్ అనిపించేంతగా ఉంది. ఆ సినిమా మెగా సక్సెస్ కావడం తథ్యం అని జోస్యం చెప్పాడు.


Click it and Unblock the Notifications











