రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ (ఫొటో)
హైదరాబాద్ : ఎప్పుడూ ఏదో ఒక వార్తతో సంచలనం సృష్టించే వర్మ ఈ సారి తన అరెస్ట్ అంటూ ఈ ఫొటోని, నేను అరెస్టు అయ్యాను న్యూస్ ని సోషల్ నెట్ వర్కింగ్ సైట్ లో షేర్ చేసారు. అయితే ఇది చూసిన వారంతా ఫన్ కోసమే అయ్యింటుంది అంటున్నారు. అది ఆయన తాజా చిత్రం ఎటాక్ చిత్రం షూటింగ్ లోది అయ్యిండే అవకాసం ఉంది.
మంచు మోహన్ బాబు, విష్ణులతో పని చేసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం మంచు మనోజ్ ను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి "ఎటాక్" అనే టైటిల్ ని పెట్టారు. ఈ చిత్రం ఫొటోలను విడుదల చేసారు. ప్రతి సినిమాను అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసే వర్మ, మనోజ్ సినిమాను ఒక నెల రోజుల్లో ఫినిష్ చేయాలని భావిస్తున్నారు. ‘కరెంట్ తీగ' తర్వాత మంచు మనోజ్ నటిస్తున్న సినిమా ఇది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
జగపతిబాబు, ప్రకాష్‌రాజ్, వడ్డే నవీన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా సురభిని ఎంచుకొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. జగపతిబాబు తదితరులపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.
ఉషాకిరణ్ ఫిలిమ్స్ చిత్రం 'బీరువా'తో తెలుగునాట అడుగుపెట్టింది సురభి. తొలి చిత్రంతోనే తన అందంతో, అభినయంతో ఆకట్టుకొంది. ఇప్పుడామెకు అవకాశాలు వరుస కడుతున్నాయి. తాజాగా రామ్‌గోపాల్ వర్మ చిత్రంలో నటించే అవకాశం అందుకొంది.


Click it and Unblock the Notifications











