రామ్ గోపాల్ వర్మ జయంతి.. వర్ధంతి ఎప్పుడంటే?..పిచ్చి పీక్స్ అంటే ఇదే
ఆర్జీవి జయంతి.. ఆ విషయం తనకింత వరకు తెలీదట రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరు ఒక్కటి చాలు.. ఎన్నో వివాదాలు గుర్తొస్తాయి. ఆర్జీవి అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనేంతగా అతని చేష్టలుంటాయి. సినిమా తీసినా, మాట్లాడినా ఏం చేసినా.. అదొక సంచలనమే.
నేడు గాంధీ జయంతి సందర్భంగా అందరూ ఆ మహాత్ముడిని తలుచుకుంటున్న వేళ.. ఆర్జీవి చేసిన కామెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గాంధీ ముఖ చిత్రంలో ఆర్జీవి ఫోటోను పెట్టి ఎడిట్ చేశాడో మహానుభావుడు. తిరిగి తిరిగి ఆ ఫోటో ఎవరి కంట్లో పడకూడదో వారి కంట్లోనే పడింది.

ఆర్జీవీ కంట్లో పడ్డ ఆ ఫోటోకు తనదైన శైలిలో.. రిప్లై ఇచ్చాడు. నాలో గాంధీ ఉన్నాడని నాకింత వరకు తెలీదు. హ్యాపీ మై జయంతి అంటూ తన స్టైల్లో కామెంట్ చేశాడు. ఇక దీనికి వర్మ వీరాభిమానులు ఆయన స్టైల్లోనే రిప్లై ఇస్తున్నారు. అయితే జనవరి 30 వర్మ వర్ధంతి జరపుతారా? అంటూ కొందరు కామెంట్లు చేయగా.. మీరు తోపు, తురుము, గ్రేట్ అంటూ వర్మ చతురతను పొగిడేస్తున్నారు. వర్మ ప్రస్తుతం కమ్మరాజ్యంలో కడప రెడ్లు అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు.


Click it and Unblock the Notifications











