Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
నీకు అలా సె** చేయడం ఇష్టమేనా: ఆరియానాకు ఆర్జీవీ సూటి ప్రశ్న.. ఆమె రియాక్షన్ చూసి షాకైన వర్మ
రాంగోపాల్ వర్మ.. ఇండియాలోనే ఈ పేరు ఒక సంచలనం. అంతలా ఆయన సినీ రంగంపైనే కాకుండా కరెంట్ ఇష్యూస్‌పై తనదైన శైలి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. తాద్వారా ఎన్నో వివాదాల్లో చిక్కుకుంటున్నాడు. బోల్డుగా ఉండే ఆయనకు అలాంటి వ్యవహార శైలే ఉన్న అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తే.. అది ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోవచ్చు. అవును.. ఇప్పుడు అదే జరిగింది. ఆర్జీవీతో బోల్డ్ బ్యూటీగా పేరొందిన ఆరియానా చిట్ చాట్ చేసింది. ఈ క్రమంలోనే సదరు దర్శకుడు ఆమెను సెక్స్ గురించి ప్రశ్నించాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!
ఆర్జీవీ వల్ల ఫేమస్ అయిన ఆరియానా
యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులతో ఆమె ఇంటర్వ్యూలు నిర్వహించింది. అందులో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన చిట్ చాట్ ఆమె కెరీర్‌నే మార్చేసింది. దీనికి కారణం ఇది చాలా బోల్డుగా జరగడమే. ఈ ఇంటర్వ్యూ తర్వాత వర్మ.. ఆరియానా గురించి ట్వీట్ చేయడంతో ఆమె ఫేమస్ అయింది.
బిగ్ బాస్‌లో ఆమెకు సపోర్టుగా ట్వీట్
ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో అసలు బిగ్ బాస్ షో అంటేనే తెలియదు అని చెప్పిన రాంగోపాల్ వర్మ... అందులో కంటెస్టెంట్‌గా ఉన్న ఆరియానా గ్లోరీకి మద్దతుగా ఓ ట్వీట్ చేశాడు. 'అందరూ ఓట్ చేసి ఆరియానాను గెలిపించండి. ఈమె మాత్రమే బిగ్ బాస్‌లో గెలవడానికి అర్హురాలు' అంటూ అందులో పేర్కొన్నాడాయన. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో అప్పట్లో తెగ హల్చల్ చేసేసింది.
వర్మతో కలిసి ఆరియానా హాట్ వర్కౌట్
నాలుగు రోజుల క్రితం వర్మ తన ట్విట్టర్లో కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. అందులో ఓ అమ్మాయి బ్యాక్‌ను, నడుమును, ఎద భాగాన్ని ఫోకస్ చేస్తూ తీసిన ఫొటోలను వదిలి.. అందులో ఉన్నది ఎవరో కనిపెట్టమన్నాడు. దీనికి చాలా మంది ఆరియానా గ్లోరీ అంటూ బదులిచ్చారు. నిజంగానే అందులో ఉన్నది ఆమె కాబట్టి.. ఆ తర్వాత వర్మ కూడా ఆ పేరును రివీల్ చేస్తూ ట్వీట్ చేశాడు.
ఆర్జీవీతో ఆరియానా బోల్డు ఇంటర్వ్యూ
ఆరియానా గ్లోరీ ఫొటోలను షేర్ చేసిన సమయంలోనే తమ ఇద్దరి మధ్య ఓ బోల్డు ఇంటర్వ్యూ జరిగిందని రాంగోపాల్ వర్మ వెల్లడించాడు. అంతేకాదు, దాన్ని జూన్ 19న విడుదల చేస్తానని కూడా చెప్పాడు. దీంతో ఇద్దరు బోల్డు వ్యక్తుల మధ్య జరిగిన ఈ ఇంటర్వ్యూ కోసం ఎంతో మంది వేచి చూశారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వీడియోను విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
‘డేంజరస్' గురించి ఆరియానా ప్రశ్నలు
రాంగోపాల్ వర్మ ఇటీవల 'డేంజరస్' అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో నైనా గంగూలీ, అప్సర రాణి లెస్బియన్ పాత్రలలో నటించారు. తొలిసారి అలాంటి సినిమాను తీసిన వర్మ.. ఇద్దరిని అందంగా చూపించారు. ఇక, దీని గురించి ఆరియానా మాట్లాడుతూ.. 'లెస్బియన్ సెక్స్ గురించి సినిమా తీశారు కదా.. అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది' అని ఆర్జీవిని ప్రశ్నించింది.
నీకు అలా చేయడం ఇష్టమేనా అంటూ
ఆరియానా అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ.. 'నిజానికి పోర్న్ అంటే మగాళ్లకు ఇష్టం. లెస్బియన్ అంటే ఇంకా పడి చచ్చిపోతారని ఓ సర్వేలో తేలింది. ఒక అమ్మాయి శృంగారం చేస్తే ఎంతో అందంగా ఉంటుంది. అదే ఇద్దరు అమ్మాయిలు చేస్తే మరింత అందంగా ఉంటుంది. అందుకే లెస్బియన్ సెక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఏ నీకు నచ్చదా' అని ఆమెనే ఎదురు ప్రశ్నించాడు రాంగోపాల్ వర్మ.
Recommended Video
ఆమె రియాక్షన్ చూసి షాకైన అర్జీవీ
లెస్బియన్ శృంగారం అంటే నీకు ఇష్టం లేదా అని అడిగిన వెంటనే ఆరియానా గ్లోరీ నో అంటూ ముఖం చీదరించుకున్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. దీంతో ఆమె రియాక్షన్‌కు షాకైన ఆర్జీవీ 'నీకు నచ్చకపోతే నచ్చకపోయింది కానీ.. ముఖం ఇలా పెట్టకు. అలాంటి వాళ్లను కించ పరచవద్దు. నేను సెక్స్‌ను ప్రేమిస్తాను. ఇద్దరు అమ్మాయిల శృంగారం అంటే మరింత ఇష్టపడతాను' అన్నాడు.