రామ్ గోపాల్ వర్మ పై కోడిగుడ్లు విసిరి నిరసన
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కి విజయవాడలో కోడి గుడ్లతో స్వాగతం లభించింది. . సిద్దార్ధ ఇంజనీరింగ్ కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశానికి హాజరయ్యేందుకు శనివారం విజయవాడకు వచ్చిన వర్మ ప్రసంగించబోయే సమయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కోడిగుడ్లు విసిరారు. వెంటనే పోలీసులు ఎలర్టై సెక్యూరిటీ టైట్ చేసారు.
వర్మతో పాటు కళాశాల పూర్వ విద్యార్థి, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వర్మ సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినుల అందానికి ముగ్ధుడైన ఆయన.. వారెవ్వా బ్యూటీస్ అంటూ కామెంట్ చేశారు. 'నేను చదువుకునే రోజుల్లో ముగ్గురు బ్యూటీలుండేవారు. ఇప్పుడు చూస్తుంటే అందరూ బ్యూటీలే' అన్నారు.
1980- 85 సంవత్సరాలలో సిద్దార్థ కళాశాలలో చదువుకున్న మూడు బ్యాచ్‌లు ఈ సమ్మేళనాన్ని నిర్వహించాయి. ఎంపీ లగడపాటి ఉత్సాహంతో బైక్ మొదటి చక్రం పైకి ఎత్తాలని ట్రై చేశారు. కానీ చేయలేకపోయారు. దీంతో వయసు పెరిగింది కదా! అంటూ చమత్కరించారు. మిత్రుడు వర్మతో కలిసి బైక్‌పై కళాశాల ఆవరణలో చక్కర్లు కొట్టారు. తాము చదువుకుంటున్న సమయంలో ఉన్న కళాశాల ప్రాంగణం, తరగతి గదులను తనివితీరా చూశారు. 25 సంవత్సరాల్లో కళాశాల రూపురే ఖలు మారిపోయాయని అన్నారు. లగడపాటి, వర్మ కలిసి ఒకే బైక్‌పై కళాశాలలో కలియతిరగడంతో విద్యార్థులు, లెక్చరర్లు ఆసక్తిగా తిలకించారు. పలువురు విద్యార్థులు ఈ సందర్భంగా ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ, సినిమాకీ, సిద్దార్థ కళాశాలకు ఎటువంటి సంబంధం లేదన్నారు. సినిమాల్లోని మంచిని మాత్రమే విద్యార్థులు గ్రహించాలన్నారు.


Click it and Unblock the Notifications











