బాబాయ్ మర్డర్ తర్వాత అవినాష్ రెడ్డితో జగన్, భారతీ ఫోన్.. లోకేష్ బ్యాచ్‌కు వర్మ దిమ్మ తిరిగేలా
సినిమాలో సరుకు ఉంటుందో లేదో కానీ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల తాను నిర్మించే సినిమాలకు ముందు చేసే హడావిడి మాత్రం మూములుగా ఉండదు. మీడియాలో ప్రకటనలు, సోషల్ మీడియాలో కామెంట్లు, ఫోటోలు షేర్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు.
అలాంటి సెన్సేషన్‌ను ఆర్జీవి వ్యూహంతో మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు రాజకీయ నేపథ్యం ఉన్న వ్యూహం సినిమాను తెరకెక్కిస్తున్నట్టు చెప్పిన విషయం సోషల్ మీడియాలో అనేక చర్చలకు దారి తీస్తున్నాయి. అయితే ఆయనపై పెట్టిన పోస్టులపై చేస్తున్న ట్రోల్స్‌కు వర్మ ఇచ్చిన సమాధానాల విషయంలోకి వెళితే..

దర్శకుడు రాంగోపాల్ వర్మ తన వ్యూహం సినిమాకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అయితే అందులో వైఎస్ జగన్, వైఎస్ భారతీ బెడ్ రూమ్‌లో ఉన్నట్టు భావిస్తున్న ఫోటోను షేర్ చేయగా దానిపై రకరకాల కామెంట్లు వినిపించాయి. అయితే తనను ట్రోల్ చేస్తూ పెడుతున్న పోస్టులపై వర్మ వివరణ ఇస్తూ ఘాటుగా స్పందించారు.
అయితే తెలుగు దేశం పార్టీకి చెందిన ఓ ట్విట్టర్ అకౌంట్‌ను వర్మను ట్రోల్ చేస్తూ.. వ్యూహంలో ఒక సీన్. తెల్లవారుజామున మూడు గంటలకు అవినాష్ రెడ్డితో ఫోన్ కాల్.. బాబాయ్‌ను లేపేసిన తర్వాత అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు వర్మ బదులిస్తూ.. వావ్ ! మీ గొర్రెల బ్యాచ్ అనుకుంటున్నట్టు నేను వాళ్లకే ఫేవర్ చేస్తూంటే , ఈ కంటెంట్ ఎందుకు పెడతాను? ఇలాంటి ఐడియాలు పప్పెక్కువ తినేవాల్లకే వస్తాయి అని అన్నారు.
వైఎస్ జగన్, వైఎస్ భారతీ పాత్రధారుల ఫోటోను ఉద్దేశించి టీమ్ లోకేష్ ట్రోల్ చేస్తూ.. వ్యూహంలో రెండో సీన్ లీక్ అంటూ పోస్టు పెట్టారు. తెల్లవారు జామున మూడు గంటలకు బాబాయ్ మర్డర్ గురించి డిస్కషన్. అవినాష్ రెడ్డి కాల్ తర్వాత అంటూ పోస్టులో కామెంట్ చేశారు.
లోకేష్ టీమ్ పోస్టుపై రాంగోపాల్ వర్మ స్పందిస్తూ.. వెధవ మాదిరిగా నా పోస్టుపై రియాక్ట్ అవ్వడంతో నేను నీకు సమాధానం ఇవ్వడానికి అవకాశం దక్కింది. నీలాంటి వెధవను ఎలా ఉద్యోగంలో పెట్టుకొన్నాడో నాకు అర్ధం కావడం లేదు అంటూ వర్మ కామెంట్ చేశారు. ఇలా వర్మ చాలా కామెంట్లకు సమాధానం ఇవ్వడం ఆశ్చర్యంగా మారింది.
ఇదిలా ఉండగా, వ్యూహం సినిమా దాదాపు నాలుగు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. తొలి భాగం వైఎస్ఆర్ మరణాంతరం సంఘటనలు.. ఆ తర్వాత వైఎస్ జగన్ పార్టీ పెట్టడం.. మూడో భాగంలో వైఎస్ జగన్ సీఎం అవ్వడం లాంటి సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తున్నది.


Click it and Unblock the Notifications











