రామ్ గోపాల్ వర్మ బయోపిక్.. ఇలా స్టార్ట్ చేస్తాడనుకోలేదు
టాలీవుడ్ విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొత్తానికి తన బయోపిక్ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. లాక్ డౌన్ లో ఎవరు ఊహించని విధంగా విభిన్నమైన కాంట్రవర్సీ కథలతో హడావుడి చేసిన ఆర్జీవి ఈ మధ్య మళ్ళీ తగ్గాడు అనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా నా బయోపిక్ రాబోతోంది అంటూ షాక్ ఇచ్చాడు.
నిజంగా వర్మ బయోపిక్ ను ఇలా స్టార్ట్ చేస్తాడని ఎవరు ఊహించలేదు. సెంటిమెంట్స్ ని పెద్దగా ఫాలో అవ్వని వర్మ తన అమ్మను అలాగే తన సోదరిని లొకేషన్ కి పిలిపించి వారి చేతుల మీదుగా బయోపిన్ ని లాంచ్ చేశాడు. ఆర్జీవి సూర్యమ్మ మొదటి షాట్ కోసం కెమెరా స్విచ్ ఆన్ చేయగా సోదరి విజయ మొదట షాట్ కి క్లాప్ కొట్టారు. ఇలా ఆర్జీవి లేడీస్ సెంటిమెంట్ తో షూటింగ్ స్టార్ట్ చేయడం వైరల్ గా మారింది. మూడు భాగాలుగా ఈ బయోపిక్ తెరకెక్కించబోతున్నారట.

ఏదేమైనా వర్మలో కూడా ప్రేమాభిమానాలు ఉన్నాయని మరోసారి రుజువయ్యింది. ఇక ఈ బయోపిక్ కి సంబంధించిన పాత్రలను కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. యంగ్ ఆర్జీవి కోసం కొత్త యాక్టర్ ని సెలెక్ట్ చేసుకున్నారు.

ఇక బొమ్మకు మురళి నిర్మిస్తున్న ఈ సినిమాకు దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం పని చేటున్నవారు అందరూ కూడా వర్మతో రెగ్యులర్ గా వర్క్ చేసేవారే. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇక వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయాలని వర్మ ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











