YS Jagan మీ మీద గౌరవం పోతుంది.. ఆ ఇడియెట్‌ను పక్కన పెట్టుకోవద్దు.. ఏపీ మంత్రిపై ఆర్జీవీ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వివాదం మరింత రాజుకొనే పరిస్థితి కనిపిస్తున్నది. సినీ హీరోలు, సినీ ప్రముఖులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించాడు. ఏపీ సెక్రటెరియట్‌లో మంత్రి నానితో చర్చలు జరిపిన తర్వాత వర్మ హైదరాబాద్‌కు చేరుకొన్నారు. అనంతరం ప్రముఖ టెలివిజన్‌లో మాట్లాడుతూ ప్రసన్నకుమార్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటే..

Recommended Video

AP Ticket Rates: RRR టికెట్ RS 2,200 - RGV | Maharashtra vs AP | Oneindia Telugu
సినిమా వాళ్ల పొట్ట కొడుతున్నామా?

సినిమా వాళ్ల పొట్ట కొడుతున్నామా?

సినిమా పరిశ్రమపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తూ.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ల పొట్టన కొడుతున్నారట. పేదవాళ్ల కోసం సినిమా టికెట్ రేట్లను తగ్గించాం. ఈ రోజు సినిమా హీరోలు కోట్లు సంపాదించుకొని బ్రహ్మండంగా ఉన్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. అదే పేదవాళ్లు సినిమా చూద్దామని థియేటర్‌కు వెళితే 100, 1000, 2000 ధరను పెడుతున్నారు. పెద్ద హీరోల సినిమా టికెట్లను బ్లాక్‌లో అమ్ముతున్నారు అని ఆరోపించారు.

ఏపీ రాష్ట్రం ఉందని తెలుసా?

ఏపీ రాష్ట్రం ఉందని తెలుసా?

ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అంతటితో ఆగకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రైనా పట్టించుకొన్నారా? ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఉన్నాడని సినిమా పరిశ్రమ పట్టించుకొన్నదా? ఎంత సేపు హైదరాబాద్‌లో కూర్చొని.. తెలంగాణలో సినిమాలు చేసుకొంటున్నారు. ఏపీ రాష్ట్రం ఉందనే విషయం మీకు తెలుసా? అని వైసీపీ నేత, ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు.

సినిమా వాళ్లను బలిసే విధంగా చేశావు

సినిమా వాళ్లను బలిసే విధంగా చేశావు

ఏపీలో పేదలు ఈ రోజు సినిమాకు వెళ్లి మూవీ చూడాలంటే 1000 రూపాయలకు పైనే టికెట్ ధర ఉంది. ఏనాడైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అడిగాడా? గతంలో ముఖ్యమంత్రిగా చేశావు. ఏపీ విభజన తర్వాత ఐదేళ్లు పాలించావు. ఆ సమయంలో సినిమా హీరోలకు, పరిశ్రమకు సపోర్ట్ చేశాడు. వాళ్లను బలిసే విధంగా చేశావే తప్ప.. ఏనాడైనా వాళ్లను ప్రశ్నించావా? సినిమా పరిశ్రమలో నీవాళ్లు, నీ కులం వాళ్లు ఉన్నారు కాబట్టి వాళ్లను సపోర్ట్ చేస్తున్నావు. పేదల కోసం టికెట్ రేట్లు వైఎస్ జగన్ తగ్గిస్తే.. మాఫియాను అణిచివేస్తావని వ్యాఖ్యలు చేస్తావా అంటూ చంద్రబాబుపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆర్జీవి ఫైర్

ప్రసన్న కుమార్ రెడ్డిపై ఆర్జీవి ఫైర్

ప్రసన్నకుమార్ రెడ్డి ప్రసంగం విన్న తర్వాత ఆర్జీవి స్పందిస్తూ.. వైఎస్ జగన్ గారు.. మీ మీద గౌరవం ఉంది. వీడిలాంటి వాడిని. ప్రసన్న కుమార్ రెడ్డి పక్కన పెట్టుకొంటే మీ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. మీ అభిమానిగా నేను మీకు ఓ సలహా ఇస్తున్నాను. ఇలాంటి ఇడియెట్స్‌ను ప్రోత్సాహించకండి అంటూ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రసన్న కుమార్ రెడ్డి ఇడియెట్ అంటూ

ప్రసన్న కుమార్ రెడ్డి ఇడియెట్ అంటూ

ప్రసన్న కుమార్ రెడ్డిని ఇడియెట్ అని ఎందుకు అంటున్నానంటే.. అసలు సినిమా పరిశ్రమ గురించి అసలు తెలియదు. సినిమా పరిశ్రమలో నటులు వేరు.. డైరెక్టర్లు వేరు, నిర్మాతలు వేరు.. డిస్టిబ్యూటర్లు వేరు.. నిర్మాతలు వేరు. సినిమా ఎక్కడ రిలీజ్ అవుతుంది. ఏం జరుగుతుందనే విషయం హీరోలకు, డైరెక్టర్లకు అసలు తెలియదు. నిర్మాతలకు కొంత మేరకు తెలుస్తుంది. ఎవరైతే బ్లాక్‌లో టికెట్స్ అమ్ముతున్నారో తెలియకుండా.. సినిమా వాళ్లను మూకుమ్మడిగా చుట్టేసి మాట్లాడే వాడిని మూర్ఖుడు అంటాం. అలాంటి వాడి గురించి నేను మాట్లాడటం శుద్ధ దండగ అని ప్రసన్నకుమార్ రెడ్డిపై రాంగోపాల్ వర్మ నిప్పులు చెరిగారు.

పేర్ని నానితో చర్చల గురించి

పేర్ని నానితో చర్చల గురించి


ఏపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్న పేర్ని నానికి అమితమైన గౌరవం ఇస్తాను. ఎందుకంటే చాలా హుందాగా మాట్లాడుతారు. నేను అదే విధంగా హుందాగా మాట్లాడుతాను. నా ముందు ఉన్న వ్యక్తిని బట్టిని గౌరవం ఇస్తాను. ప్రసన్నకుమార్ రెడ్డి లాంటి వాడికి గౌరవం ఇవ్వడం నాకు సరిపడదు అని వర్మ అన్నారు. ఏపీ మంత్రి పేర్ని నానితో సానుకూలమైన చర్చ జరిగింది. సినీ పరిశ్రమ గురించి కొన్ని విషయాలు వారికి చెప్పాను. వారు ఆలోచించుకొని ఓ నిర్ణయానికి వస్తానని తాను భావిస్తున్నాను అని రాంగోపాల్ వర్మ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X