twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చంద్రబాబు మార్ఫింగ్ ఫోటోలు.. అడ్డంగా బుక్కైన ఆర్జీవీ!

    |

    దర్శకుడు రాంగోపాల్ వర్మకు వివాదాలు కొత్తేమీ కాదు. ఆర్జీవీ నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటాడు. వాటి నుంచి తెలివిగా ఎలా తప్పించుకోవాలో కూడా అతడికి బాగా తెలుసు. ఇటీవల గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంతో సంచలనమే సృష్టించారు. ఎన్టీఆర్ జీవితంలోని వివాదాస్పద సంఘటనలతో ఆర్జీవీ ఆ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ నేతలు కోర్టుకెక్కడంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర విడుదల ఆంధ్రాలో ఆగిపోయింది. కేవలం తెలంగాణాలో మాత్రమే విడుదలయింది. తాజాగా వర్మ మరో వివాదంలో చిక్కుకున్నాడు.

     మార్పింగ్ ఫోటోలు

    మార్పింగ్ ఫోటోలు

    కొన్ని రోజుల క్రితం రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో చంద్రబాబు మార్ఫింగ్ ఫోటోని పోస్ట్ చేశాడు. చంద్రబాబు జగన్ సమక్షంలో వైసిపిలో చేరుతున్నట్లు ఉన్న మార్ఫింగ్ ఫోటోని పోస్ట్ చేశాడు. మరో మార్ఫింగ్ ఫొటోలో నారా లోకేష్, బ్రాహ్మణి, బాలకృష్ణ ప్రతిష్టని దిగజార్చేలా కామెంట్స్ ఉన్నాయి. వర్మ ఆ మార్ఫింగ్ ఫొటోలతో చేసిన ట్వీట్స్ ఇప్పుడు తీవ్ర వివాదంగా మారుతున్నాయి.

     కేసు నమోదు

    కేసు నమోదు

    ఆర్జీవీ ట్వీట్స్ ని సీరియస్ గా తీసుకున్న ఓ టిడిపి కార్యకర్త అతడిపై పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెంలో కేసు నమోదు చేశారు. దేవి బాబు చౌదరి అనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు నమోదు చేశారు. నేను ఇప్పటికే తెలంగాణాలో ఆర్జీవిపై కేసు నమోదు చేశా. పోలీసులు తగిన చర్య తీసుకుంటాం అని హామీఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రలో కూడా ఫిర్యాదు చేశానని అతడు తెలిపాడు.

     క్షమాపణ చెప్పే వరకు

    క్షమాపణ చెప్పే వరకు

    అర్జీవిపై మా పోరాటం అతడు క్షమాపణ చెప్పే వరకు కొనసాగుతూనే ఉంటుంది. అతడి చర్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. పోలీసులు ఆర్జీవీ చేసిన ఆ ట్వీట్స్ గురించి విచారణ జరుపుతాం అని హామీ ఇచ్చారు. ఆర్జీవీ గత కొన్ని రోజులుగా చంద్రబాబుని, ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్స్ చేస్తున్నట్లు దేవీబాబు తెలిపారు.

     అనవసరమైన కామెంట్స్

    అనవసరమైన కామెంట్స్

    అర్జీవిపై నమోదైన కేసు గురించి పోలీసులు కూడా స్పందించారు. ఆర్జీవీ చంద్రబాబు కుటుంబంపై చేసిన కామెంట్స్ అనవసరమైనవిగా అనిపించాయి. మార్ఫింగ్ ఫోటోలపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటాం అని పోలీసులు అన్నారు. ఆర్జీవీ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ పై ఆంధ్రాలో ప్రస్తుతం స్టే కొనసాగుతోంది. కోర్టు చిక్కులు తొలిగిన తర్వాతే ఆంధ్రాలో ఈ చిత్ర విడుదలకు అనుమతిస్తారు.

    English summary
    Ram Gopal Varma booked for posting morphed photos of Chandrababu Naidu on Facebook A TDP activist has complained against Ram Gopal Varma for posting morphed pictures of N Chandrababu Naidu on his Facebook page.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X