Kalki 2898 AD: కల్కి మూవీలో రాంగోపాల్ వర్మ సర్‌ప్రైజ్.. ప్రభాస్‌కు షాకిచ్చే పాత్రలో సంచలన దర్శకుడు

తెలుగు సినిమా స్టామినాను విశ్వవ్యాప్తంగా చేసిన హీరోల్లో రెబెల్ స్టార్ ప్రభాస్ ఒకడు. 'బాహుబలి' చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన అతడు.. అప్పటి నుంచి బహుభాషా సినిమాల్లోనే నటిస్తూ సత్తా చాటుతోన్నాడు. ఇలా ఇప్పటికే ఎన్నో భారీ బడ్జెట్ చిత్రాలతో వచ్చి ప్రేక్షకులను, అభిమానులను అలరించాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' సినిమాను చేశాడు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా నటించాడు. ఇంతకీ ఆయన ఏ పాత్రను పోషించాడో మీరే చూసేయండి మరి!

కల్కిగా ఎంటరైన ప్రభాస్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తీసిన సినిమానే 'కల్కి 2898 ఏడీ'. ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ నిర్మించారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నారు. ఈ భారీ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు.

Ram Gopal Varma Cameo Role Highlight In Prabhas Starrer Kalki 2898 AD Movie

పాన్ వరల్డ్ రేంజ్‌లో కల్కి

క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' మూవీని టైం ట్రావెల్ కథతో పాన్ వరల్డ్ రేంజ్‌లో తెరకెక్కించినట్లు ముందుగానే తెలిసింది. దీని నుంచి టీజర్, పాటలు, ట్రైలర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో సినిమాపై అంచనాలన్నీ రెట్టింపు అయ్యాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్‌లో విజువల్ వండర్‌గా తీసుకు వచ్చేశారు.

Ram Gopal Varma Cameo Role Highlight In Prabhas Starrer Kalki 2898 AD Movie

గ్రాండ్ రిలీజ్.. రచ్చగానే
విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న 'కల్కి 2898 ఏడీ' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 8500లకు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ ప్రభాస్ అభిమానులతో రచ్చతో మోత మోగిపోతున్నాయి.

Ram Gopal Varma Cameo Role Highlight In Prabhas Starrer Kalki 2898 AD Movie

విడుదల.. అలాంటి టాక్

'కల్కి 2898 ఏడీ' మూవీకి సంబంధించి ఇప్పటికే ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో షోలు ప్రదర్శితం అయిపోయాయి. అన్ని చోట్లా దీనికి మంచి స్పందన దక్కింది. దీంతో షోలన్నీ హౌస్‌ఫుల్ అయిపోయాయి. అందుకు తగ్గట్లుగానే టాక్ కూడా పాజిటివ్‌గానే వస్తోంది. దీంతో మొదటి రోజు ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ వస్తాయన్న టాక్ వినిపిస్తోంది.

Ram Gopal Varma Cameo Role Highlight In Prabhas Starrer Kalki 2898 AD Movie

కల్కిలో రాంగోపాల్ వర్మ
భారీ బడ్జెట్‌తో 'కల్కి 2898 ఏడీ' సినిమాను వైవిధ్యంగా తెరకెక్కించారు. ముఖ్యంగా ఇందులో చాలా మంది స్టార్లను కూడా భాగం చేశారు. అదే సమయంలో కొందరు సినీ ప్రముఖులను అతిథి పాత్రల్లో చూపించారు. ఇందులో భాగంగానే ఈ చిత్రంలో సంలచన దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఉన్నాడు. ఆయన పాత్రకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Ram Gopal Varma Cameo Role Highlight In Prabhas Starrer Kalki 2898 AD Movie

ఏ పాత్రను చేశాడో తెలిస్తే

విజువల్ వండర్‌గా రూపొందిన 'కల్కి 2898 ఏడీ' సినిమాలో రాంగోపాల్ వర్మ పాత్ర వివరాలు కూడా లీక్ అయ్యాయి. ఇందులో ఆయన ఓ బిజినెస్ డీలర్‌గా కనిపించాడు. అంతేకాదు, ప్రభాస్‌కే షాకిచ్చేలా తనదైన డైలాగులతో మెప్పించాడు. ఇక, స్క్రీన్‌పై రాంగోపాల్ వర్మ కనిపించగానే థియేటర్లు అన్నీ దద్దరిల్లిపోయేలా ప్రేక్షకులు కేకలు వేస్తున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X