రామ్ గోపాల్ వర్మ అనంతపురం ప్రయాణం రద్దు!! ఎందుకంటే
రక్త చరిత్ర సినిమా ప్రారంభ వేడుకలను అనంతపురం జిల్లా కేంద్రంలోనే తన యూనిట్ వారితో కలిసి చూస్తానని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకోసం హెలీకాప్టర్ లో గురువారం రాత్రి బయిలుదేరతారని కూడా వినిపించింది. అయితే తాజాగా అనంతపురం ఉద్రిక్త వాతావరణం నెలకొనటంతో రామ్ గోపాల్ వర్మ తన అనంత పర్యటనన రద్దు చేసుకున్నాడు. హైదరాబాద్ లోనే చిత్రాన్ని చూడడానికి నిశ్చయించుకున్నాడు. మరో ప్రక్క రక్త చరిత్ర చిత్రంలో అనంతపురం జిల్లాను నేరమయంగా చూపిస్తే ఆ సినిమాను రచ్చకీడుస్తామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్.విష్ణువర్దనరెడ్డి దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇప్పటికే హెచ్చరించారు. కేవలం చిల్లర డబ్బులు కోసమే సినిమా తీసే ఆలోచన మానాలని వర్మకు సూచించారు. సినిమా థియేటరు యజమానులు కూడా సినిమా ఆడకుండా సహకరించాలని కోరారు. మరో ప్రక్క పట్టణ డిజీపీ కూడా భద్రతా కారణాల దృష్ట్యా రామ్ గోపాల్ వర్మను అనంతపురం రావద్దని కోరినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











