రామ్ గోపాల్ వర్మ చిన్నతనంలో ఇలా....(ఫోటో)
హైదరాబాద్: రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం రేపుతూ ట్వీట్లు చేస్తుంటారు. కానీ ఈ సారి మాత్రం తన చిన్ననాటి ఫోటో పోస్టు చేసాడు. తనకు ఊహ తెలియని వయసులో తన తాతయ్యతో కలిసి దిగిన ఫోటో ఇది.
ఆ ఫోటోల సంగతి పక్కనబెట్టి రామ్ గోపాల్ వర్మ తాజా వివాదంలోకి వెళితే...
అనుమతి లేకుండా పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఎక్కడమే కాకుండా ఫోటో దిగి తాను అరెస్ట్ అయ్యానంటూ ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్విటర్‌లో పోస్టుచేసిన ఉదంతాన్ని బంజారాహిల్స్ పోలీసులు సీరియస్ అయ్యారు.

శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగమం వద్ద విధుల్లో ఉన్న బంజారాహిల్స్ పెట్రోలింగ్ వాహనంలోకి రాంగోపాల్ వర్మ సివిల్ దుస్తుల్లో ఎక్కి ముందు సీట్లో కూర్చున్నారు. నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా ఫోటో దిగి అరెస్ట్ అయ్యానంటూ తప్పుడు సందే శాన్ని ట్విట్టర్లో పోస్టు చేసారు. ఈ ఘటనపై డ్రైవర్ శ్రీధర్‌రెడ్డిని ఉన్నతాధికారులు ఆదేశించారు. శ్రీధర్‌రెడ్డి ద్వారా ఫిర్యాదు తీసుకుని వర్మపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్దమౌతున్నట్లు తెలిసింది.


Click it and Unblock the Notifications











