ఆ కేసులో కూడా నట్టి అండ్ కో హ్యాండ్.. వర్మ క్లారిటీ.. ఇప్పుడే సినిమా మొదలంటూ!
కొద్ది రోజుల క్రితం దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై హైదరాబాద్ లో చీటింగ్ కేసు నమోదు అయింది. ప్రొడక్షన్ హౌస్‌ను రూ.56 లక్షల మేర మోసం చేశారన్న ఆరోపణలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. శేఖర ఆర్ట్ క్రియేషన్స్‌కు చెందిన కొప్పాడ శేఖర్ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అయితే ఇప్పుడు తన మీద చీటింగ్ కేసు పెట్టిన శేఖర్ రాజు వ్యవహారం మీద రామ్ గోపాల్ వర్మ స్పందించారు.
Recommended Video

2019 ఆఖర్లో శేఖర్ రాజు అనే వ్యక్తి దిశా ఎన్కౌంటర్ అనే సినిమా తొలి కాపీ 3 కోట్ల ఫస్ట్ కాపీ వ్యయంతో నాతో నిర్మించడానికి ఒప్పుకోవడం జరిగింది అని పేర్కొన్నారు. అయితే అప్పుడు శేఖర్ రాజు 56 లక్షల వరకు ఇఛ్చి షూట్ మొదలు పెట్టిన తర్వాత తన వద్ద ఇంకా డబ్బులు లేవని , ఎక్కడినుంచో రావాల్సిన డబ్బులు రాలేదని చెప్పినట్టు వర్మ పేర్కొన్నారు.
అలా అయితే ఇంక సినిమా షూటింగ్ ఆపేస్తున్నానని , ఇంకో నిర్మాత ఎప్పుడైనా వస్తే రిలీజ్ అయ్యే టైంకి ఆయన డబ్బు తిరిగిస్తానని ఒప్పుకున్నానని వర్మ పేర్కొన్నారు. చాలా నెలల తర్వాత మరో నిర్మాత అనురాగ్ కంచెర్ల ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకి వస్తే ఆ విషయం తెలిసిన శేఖర్ రాజు తనకు డబ్బు వద్దని అసోసియేట్ ప్రొడ్యూసరుగా ఉంటానని అన్నారని చెప్పుకొచ్చారు.

దానికి నేను అలా అయితే అనురాగ్ కి తన మొత్తం పెట్టుబడి తిరిగి వచ్చిన తర్వాతే నీ డబ్బు వస్తుందని చెప్పానని, దానికి తాను ఒప్పుకున్నాడని అన్నారు. అయితే ఆ తర్వాత ఫోన్లో విసిగించడం మొదలు పెట్టగా, నేను నీ పేరు వేసి ట్రైలర్ రిలీజ్ అయిన ఏడాది తర్వాత ఇదేంటని అడిగానని అప్పుడే మే 2021లో మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నా మీద కంప్లైంట్ పెట్టాడని అన్నారు.
అప్పుడు నేను తనని పిలిపించి మాట్లాడుకున్న అన్నీ గుర్తు చేస్తే తనని ఎవరో ముగ్గురు ప్రేరేపిస్తున్నారని సారీ చెప్పి వెళ్ళిపోయాడని అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇలా చేస్తున్నాడని అన్నారు. ఇక తమ మధ్య జరిగిన అన్ని విషయాలకు సంబంధించిన కాల్ డేటా రికార్డ్స్, స్క్రీన్ షాట్స్, వాయిస్ నోట్స్ ని, పోస్టర్స్ ని, ట్రైలర్స్ ని అధికారులకి సమర్పించామని ఇప్పుడు మీ మీడియా కి కూడా విడుదల చేస్తున్నామని అన్నారు.
ఇక శేఖర్ రాజు మొదట్లో తననెవరో ముగ్గురు ప్రేరేపిస్తున్నారని చెప్పిన విషయాన్ని బట్టి నేను కేసు పెట్టిన నట్టి క్రాంతి , నట్టి కరుణ కూడా ఉన్నారేమో అని అనుమానం కలుగుతోందని ఆయన అన్నారు. ఎందుకంటే నట్టి క్రాంతి, నట్టి కరుణ వాళ్ళ ఫాదర్ శేఖర్ రాజు పక్కన ఉన్నారని అన్నారు. ఈ వ్యవహారంలో లోటు పాట్లు పరిశీలించి మా అడ్వొకేట్లు ఆ నలుగురు మీద ఫర్దర్ కేసులు ప్రిపేర్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పుడే సినిమా మొదలయ్యిందని వర్మ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











