Vyooham అలాంటి సినిమా కాదు.. ఇడియెట్స్ అలా ఊహించుకోవద్దు.. వైఎస్ జగన్, భారతీ బెడ్ రూమ్ సీన్‌పై వర్మ సీరియస్
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న వ్యూహం సినిమా ఆరంభంలోనే సెన్సేషనల్‌గా, వివాదాస్పదంగా మారింది. ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఆయన వ్యూహం సినిమా గురించి చెప్పగానే... వైఎస్ జగన్ బయోపికా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాను తీసేది బయోపిక్ కాదు.. అంతకు మించిన రియల్ పిక్.. అంటే వర్మ కామెంట్ చేశారు. అయితే వ్యూహం సినిమాపై వర్మ రిలీజ్ చేసిన ఫోటోలపై రకరకాల కామెంట్లు, సెటైర్లు వినిపించాయి. అయితే వాటిపై రాంగోపాల్ వర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ వేయగా వైరల్ అయింది. ఆ వైరల్ ట్వీట్ వివరాల్లోకి వెళితే..
వ్యూహం సినిమాకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులకు వర్మ షాకిచ్చాడు. అయితే ఆ ఫోటోలపై కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూల వర్గాల నుంచే వ్యతిరేకత వ్యక్తమైంది. సీరియస్ సినిమా చేస్తాడనుకొంటే.. పొలిటికల్ కామెడీ సినిమాను తీస్తున్నాడా? అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపించాయి.

వ్యూహం సినిమా బయోపిక్ కాదు.. బయోపిక్‌లో అబద్దాలు ఉంటాయేమో.. రియల్ పిక్‌లో నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయి అని కామెంట్ చేసిన వర్మ.. వైఎస్ జగన్, వైఎస్ భారతీ బెడ్ రూమ్ సీన్ ఫోటోను షేర్ చేయడంతో రకరకాల సందేహాలు, అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇంతకు ఈయన సీరియస్‌గా సీరియస్ సినిమా తీస్తున్నాడా? అనే ప్రశ్నలు లేవనెత్తారు.

అయితే వ్యూహం సినిమా పక్కాగా సీరియస్ రియల్ పిక్ అనుకొన్న వారికి.. వైఎస్ జగన్, వైఎస్ భారతీ బెడ్ రూమ్ సీన్ ఫోటో షేర్ చేయడంతో రకరకాల కామెంట్లు వైరల్ అయ్యాయి. దాంతో ఆ ఫోటోను షేర్ చేస్తూ వర్మ ఘాటుగా స్పందించారు. వ్యూహం అలాంటి సినిమా కాదు అంటూ వర్మ ట్వీట్ చేసి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
వ్యూహం సినిమాలోని బెడ్ రూమ్ సీన్‌పై కామెంట్లు పెడుతున్న నెటిజన్లపై వర్మ ఆగ్రహం చేస్తూ.. కొందరు డంబ్ ఇడియెట్స్ వ్యూహం సినిమా గురించి ఏదో అనుకొంటున్నారు. వైఎస్ భారతీ పాత్ర గురించి ఏదో ఊహించుకొంటున్నారు కొందరు వెధవలు. కానీ వ్యూహం సినిమా.. వైఎస్ఆర్ మరణం తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తీస్తున్నాం అంటూ ఎన్నడూ లేని విధంగా వర్మ వివరణ ఇచ్చుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

వైఎస్ఆర్ మరణం తర్వాత కొన్ని దుష్ట శక్తులు ఆ విషాద సంఘటనను అవకాశంగా తీసుకొని రాజకీయాలు చేశారు. అలాంటి సమయంలో వైఎస్ జగన్ జీవితంలో వైఎస్ భారతీ కీలకంగా వ్యవహరించారు. అయితే వ్యూహం సినిమా ఆమె కథ కాదు అంటూ రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాపై ట్వీట్లు వేసి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

అయితే బెడ్ రూమ్ సీన్ గురించి వర్మపై నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. వర్మను ఉద్దేశించి.. బెడ్ రూమ్ సీన్ పెట్టావ్ ఏంట్రా.. మెంటలోడా.. అంటూ ఓ నెటిజన్ తిట్లదండకం చేపట్టాడు. తండ్రిని లేపిన సీనా? అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఈ రాష్ట్రం మొత్తానికి తెలుసు.. ఆ విషాద సంఘటనను ఎవరు అవకాశంగా మలుచుకొనే ప్రయత్నం చేశారో అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. మరో నెటిజన్ కాస్త ముందుకెళ్లి.. రొమాంటిక్ సీన్లు ఉంటాయా? ఎందుకంటే నీవు బోల్డ్ డైరెక్టర్ అని కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











