»   » రాజమౌళికి ‘పద్మశ్రీ’ దక్కడంపై వర్మ కామెంట్స్!

రాజమౌళికి ‘పద్మశ్రీ’ దక్కడంపై వర్మ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దర్శకుడు రాజమౌళికి ప్రతిష్టాత్మ పద్మశ్రీ అవార్డు దక్కడంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన రీతిలో స్పందించారు. ‘రాజమౌళికి పద్మశ్రీ దక్కింది....కానీ నాకు నా చిన్న నాటి స్నేహితురాలు పద్మ కూడా దక్కలేదు. ఇది బాహుబలియన్ ఫెయిల్యూర్' అంటూ ట్వీట్ చేసారు.

కేంద్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించిన పద్మ అవార్డుల్లో దర్శకుడు రాజమౌళికి కూడా స్థానం దక్కిన సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును రాజమౌళి అందుకోబోతున్నారు. రాజమౌళికి ఈ అవార్డు వచ్చిన సంగతి తెలియగానే తెలుగు ప్రేక్షకులు సంతోష పడ్డారు. ఆయన టాలెంటుకు తగిన గుర్తింపు వచ్చిందని చర్చించుకుంటున్నారు.

షాక్... రాజమౌళికి ‘పద్మశ్రీ' అలా వచ్చిందా?

Ram Gopal Varma comments about Rajamouli's Padmasri

అవార్డులకు ఎంపికైన ఇతర సెలబ్రిటీలు...సినిమా రంగానికి సంబంధించి ఈ సారి అత్యున్నత పురస్కారం రజనీకాంత్‌ ను వరించింది. ఆయనకు ‘పద్మ విభూషణ్' పురస్కారాన్ని ప్రకటించారు. అదే విధంగా అనుపమ్ ఖేర్, గాయకుడు ఉదిత్ నారాయణ్ కు పద్మభూషణ్ లకు అవార్డును ప్రకటించారు.అదే విధంగా బాలీవుడ్ నటులు అజయ్ దేవగన్, ప్రియాంక చోప్రాలకు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు.

English summary
"Rajamouli got Padmashree and I dint even get my childhood sweetheart Padma😔...This i think is a Bahubalian failure" RGV said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu