twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏపీ ముఖ్యమంత్రితో చిరంజీవి భేటీ.. రామ్ గోపాల్ వర్మ రియాక్షన్! రియల్లీ బ్యూటిఫుల్

    |

    Recommended Video

    RGV Comments On Chiranjeevi, YS Jagan Meet || జగన్ ,చిరు భేటి పై RGV

    మెగాస్టార్ చిరంజీవి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన సంగతి తెలిసిందే. సతీసమేతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి వెళ్లిన చిరు.. ఆయన్ను శాలువాతో సన్మానించి కాసేపు ముచ్చటించారు. ఈ మేరకు తన చారిత్రక సినిమా సైరా నరసింహా రెడ్డి చూడాలని ఆయన్ను కోరారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే.

    చర్చనీయాంశంగా మారిన ఇష్యూ.. ఎంటరైన వర్మ

    చర్చనీయాంశంగా మారిన ఇష్యూ.. ఎంటరైన వర్మ

    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి- చిరంజీవి భేటీ అంశం తెలుగు రాష్ట్రాల్లో, అదేవిధంగా సినీ, రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినీ పరిశ్రమ అభివృద్ధి, సైరా నరసింహా రెడ్డి సినిమా విశేషాలు వీరి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చాయని తెలిసింది. అయితే ఈ ఇష్యూపై రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్ కామెంట్ విసిరారు.

    సరిగ్గా ఎన్నికల సమయంలో వర్మ స్టెప్

    సరిగ్గా ఎన్నికల సమయంలో వర్మ స్టెప్

    ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రామ్ గోపాల్ వర్మ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఎన్నికలు సమీపించిన తరుణంలోనే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశారు వర్మ. అయితే ఆ సమయంలో టీడీపీ వర్గాలు అడ్డుపడటం లాంటి చర్యలు జరగడం.. దానిపై వర్మ రియాక్ట్ కావడం లాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి.

    రిసల్ట్ తర్వాత..

    రిసల్ట్ తర్వాత..

    ఎన్నికల రిసల్ట్ వచ్చి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఏపీలో విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో క్రమంగా
    మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వర్మ విరుచుకు పడటం చూసాం. ఈ క్రమంలో మళ్ళీ ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి- చిరంజీవి భేటీ విషయమై వర్మ కామెంట్ చేయడం చర్చలకు దారి తీసింది.

    ఇంతకీ వర్మ ఏమన్నాడంటే..

    వైఎస్ జగన్ మోహన్ రెడ్డి- చిరంజీవి కలయిక చూసిన రామ్ గోపాల్ వర్మ.. వావ్ అంటూ సింగల్ లైన్ కామెంట్ విసరడం విశేషం. 151 తో 151 అని సింపుల్ గా కట్ చేస్తూ చిరంజీవికి జగన్ బహుకరించిన వీణ పిక్ షేర్ చేశారు వర్మ. ఆయన చేసిన ఈ కామెంట్‌లో 151 సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి, 151 స్థానాల్లో విజయకేతనం ఎగరేసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారని అర్థం దాగి ఉంది. దీంతో ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

    డిఫెరెంట్ సినిమాలతో..

    డిఫెరెంట్ సినిమాలతో..

    ఈ మధ్య కాలంలో డిఫెరెంట్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు వర్మ. ఈ క్రమంలోనే `కమ్మ రాజ్యంలో కడప రెడ్లు` అంటూ మరో డిఫెరెంట్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో ఏ మాత్రం కాంట్రవర్సీ లేదు అని చెబుతూనే సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రాజకీయ వర్గాలకు చుక్కలు చూపిస్తున్నాడు వర్మ.

    బ్యూటిఫుల్ అంటూ మరో రచ్చ

    బ్యూటిఫుల్ అంటూ మరో రచ్చ

    ఇక బ్యూటిఫుల్ సినిమా రూపంలో మరో రచ్చకు తెరలేపారు వర్మ. రంగీలా సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రూపొందిస్తునట్లుగా ఆయన పేర్కొన్నారు. బ్యూటిఫుల్ చిత్రాన్ని నేటితరం యువత కోరుకునే విధంగా బ్యూటిఫుల్ గా రూపొందిస్తున్నారని ఇటీవలే విడుదల చేసిన అప్‌డేట్స్ చెప్పేశాయి.

    English summary
    Chiranjeevi meets AP CM YS Jagan Mohan Reddy on October 14th in his home. On this meet Ram Gopal Varma Comments goes viral.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X