మళ్లీ జన్మంటూ ఉంటే మేయర్ కుక్కగా.. నా తల్లి కూడా అలాంటి ప్రేమను చూపించలేదు.. ఆర్జీవి ఎమోషనల్
సోషల్ మీడియాలో దర్శకుడు రాంగోపాల్ వర్మ చేసే ట్వీట్లు కొన్నిసార్లు స సంచలనంగాను, అలాగే మరికొన్ని సార్లు వివాదానికి కేంద్ర బిందువుగా మారుతాయి. తాజాగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మీ వీడియో గురించి చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఆ వీడియోపై చేసిన కామెంట్ల గురించి ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూ..

వైరల్‌గా హైదరాబాద్ మేయర్ వీడియో
హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మికి సంబంధించిన వీడియో ఇటీవల వైరల్ అయింది. ఆ వీడియోను గురించి వర్మ స్పందిస్తూ.. నేను చాలా ఎమోషనల్ అయ్యాను. ఆ వీడియో చూసిన తర్వాత ఆమె ఫ్యామిలీనే కాకుండా పార్టీని, కేటీఆర్‌ను, కేసీఆర్‌ను, తెలంగాణ ప్రజలను ప్రేమిస్తారా అనేది డౌట్‌గా ఉంది. తన పెంపుడు కుక్కను ప్రేమించడం చూస్తే అలాంటి అనుమానం వచ్చింది. అందరూ డాగ్‌ను చూసి జెలసీగా ఫీలవుతారు అని తన ట్వీట్‌లో వర్మ పేర్కొన్నారు.

పెంపుడు కుక్కను ప్రేమగా
హైదరాబాద్ మేయర్ తన పెంపుడు కుక్కపై చూపించే ప్రేమను చూస్తే.. ప్రజలను కూడా అంతగా ప్రేమిస్తుందా అనే విషయం ఆశ్చర్యంగా ఉంది. వచ్చే జన్మంటూ ఉంటే నేను ఆమె పెంపుడు కుక్కలా జన్మించాలి. ఆమె నుంచి అంతగా ప్రేమను పొందాలి అంటూ మరో ట్వీట్ చేశారు.

మేయర్ నిస్వార్ధమైన ప్రేమ
మేయర్ చూపించిన ప్రేమను చూస్తే అత్యంత నిస్వార్థంతో కూడిన ప్రేమ కనిపించింది. కుడి చేతితో డాగ్‌కు తినిపిస్తూ.. ఎడమ చేతితో తాను ఆహారం తింటూ కనిపించిన తీరుతో నేను ఎమోషనల్‌గా మారాను. పెంపుడు కుక్కను ప్రేమించిన తీరు చూస్తే ఆమెను ఇంటర్నేషనల్ మేయర్ ఆఫ్ డాగ్‌గా నియమించాలని అభిప్రాయం కలిగింది అంటూ వర్మ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

మేయర్‌ను చూసి ఎమోషనల్‌గా
మాఫియా, క్రైమ్ లాంటి సినిమాలు తీసిన నాలో క్రూరత్వం ఉందని అంతా అనుకొంటారు. కానీ నాలో ఇలాంటి మానవత్వం, ప్రేమ కూడా ఉందనే విషయాన్ని చెప్పడానికే నేను ట్వీట్ చేశాను. తన పెంపుడు కుక్కకు భోజనం పెడుతున్న మేయర్ వీడియో చూసిన తర్వాత నేను ఎమోషనల్ అయ్యాను అని రాంగోపాల్ వర్మ అన్నారు.

మళ్లీ జన్మంటూ ఉంటే మేయర్ కుక్కగా
రాంగోపాల్ వర్మ తన ట్వీట్‌లో కేసీఆర్, కేటీఆర్‌ను ప్రస్తావించడాన్ని సమర్థించుకొన్నారు. మేయర్ విజయలక్ష్మీ చూపించిన ప్రేమను ఇంత వరకు తాను చూడలేదు. నా తల్లి నుంచి కూడా అలాంటి ప్రేమను పొందలేదు. అందుకే నేను మళ్లీ జన్మంటే ఉంటూ కుక్కగా పుట్టాలని కోరుకొన్నాను అని వర్మ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యలో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











