For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రాత్రి 11 గంటలకు శ్రీదేవి కాల్.. నా భార్య చెంప పగలగొట్టింది.. రామ్ గోపాల్ వర్మ సెన్సేషన్

  |

  రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయనేం మాట్లాడినా అదో ప్రభంజనం. మనసుకు ఏదనిపిస్తే అది ఏ మాత్రం దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేయడం ఆయన నైజం. ఇదే వర్మలోని బెస్ట్ క్వాలిటీ కూడా. కానీ వర్మ ముక్కుసూటి మాటలు కొన్ని సందర్భాల్లో పలు సమస్యలకు దారి తీస్తుంటాయి. అయినా అవేవీ పట్టించుకోడు వర్మ. ఇంటా, బయటా ఎక్కడైనా వర్మ మాట్లాడే తీరే అలా ఉంటుంది. అయితే ఈ తీరే అతని భార్య చేతిలో చెంపదెబ్బ తినేలా చేసిందట. ఆ విషయాన్ని స్వయంగా వర్మనే వెల్లడించాడు. అంతేకాదు ఇండియాలో పెళ్లి వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు వర్మ. వివరాల్లోకి పోతే..

   లివింగ్ రిలేషన్‌షిప్ గురించి వర్మ

  లివింగ్ రిలేషన్‌షిప్ గురించి వర్మ

  తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో భార్యభర్తల మధ్య లివింగ్ రిలేషన్‌షిప్ గురించి ఆసక్తికరగా మాట్లాడాడు రామ్ గోపాల్ వర్మ. ఈ నేపథ్యంలో పెళ్లి వ్యవస్థతోనే అసలు సమస్యలు మొదలైతాయని సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను తన భార్య దగ్గర కూడా తాను ఓపెన్ గానే ఉంటానని, ఆ కారణంగానే ఆమె చేత చెంప దెబ్బ తినాల్సి వచ్చిందని చెప్పాడు వర్మ.

  ఆడ, మగ.. నాచురల్ రిలేషన్ వేరు సోషల్ రిలేషన్ వేరు

  ఆడ, మగ.. నాచురల్ రిలేషన్ వేరు సోషల్ రిలేషన్ వేరు

  ఆడ, మగ మధ్య సంబంధం అనేది నాచురల్‌గా చూస్తే వేరుగా ఉంటుందని, అదే ఆడ, మగ పెళ్లి విషయానికొస్తే దానికి సమాజ పద్ధతులు కలగలిపి చూస్తారని అంటున్నాడు వర్మ. అయితే ఎవరి ఇష్టాలు వారికుంటాయని, కానీ పెళ్లి కారణంగా కొన్నింటిని దాచేయడం, వదులుకోవడం లాంటివి చేయాల్సి వస్తుందని ఆయన అన్నాడు. దీనికి ఓ ఉదాహరణ అంటూ తన లైఫ్‌లో జరిగిన ఓ సంఘటనను వివరించాడు వర్మ.

  మా ఆవిడ వద్ద శ్రీదేవి గురించి

  మా ఆవిడ వద్ద శ్రీదేవి గురించి

  శ్రీదేవి గారిని నేను చాలా పెద్ద ఫ్యాన్‌ని. ఓ సమయంలో నేను శ్రీదేవి గురించి నాభార్య వద్ద మాట్లాడగా, ఆమె సరదాగా తీసుకొని జోకులేసింది. ఎందుకంటే అప్పటిదాకా శ్రీదేవికి నాకు చాలా దూరం ఉండేది కాబట్టి. అదే పక్కింటి ఆంటీ బాగుందంటే నా భార్య ఊరుకునేది కాదు. సో.. అంత వరకూ బాగానే ఉంది.

  ఓ రోజు రాత్రి 11 గంటలకు శ్రీదేవి కాల్

  ఓ రోజు రాత్రి 11 గంటలకు శ్రీదేవి కాల్

  కానీ శివ రిలీజ్ కాగానే క్షణక్షణం సినిమా అనౌన్స్ అయింది. ఆ టైమ్ లో శ్రీదేవి గారు నా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అప్పుడు మొదలైంది నా భార్యలో టెన్షన్. ఆ తర్వాత షూటింగ్ సమయంలో ఓ రోజు రాత్రి 11 గంటలకు శ్రీదేవి కాల్ చేసింది. అప్పుడు నేను లేకపోవడంతో నా భార్య ఫోన్ రిసీవ్ చేసుకుంది. నేనొచ్చాక శ్రీదేవి కాల్ చేసిన విషయం చెబుతూ కాస్త కోపంగా మందలించింది.

  శ్రీదేవి తో అఫైర్ ఉందని అనుకుంటే అంతకన్నా అదృష్టమా..

  శ్రీదేవి తో అఫైర్ ఉందని అనుకుంటే అంతకన్నా అదృష్టమా..

  నా భార్య అడిగిన విధానాన్ని బట్టి చూస్తే శ్రీదేవితో నాకు అఫైర్ ఉందన్నట్లుగా అనిపించింది. ఆ టైమ్ లో నాకు పట్టలేని ఆనందం. ఈ ప్రపంచంలో ఎవ్వరైనా సరే శ్రీదేవితో నాకు అఫైర్ ఉందని అనుకోవడం అంటే అంతకన్నా అదృష్టం మరోటి లేదు.

  వెంటనే నా నోట్లోంచి ఆ మాట.. నా భార్య చెంప చెల్లుమనిపించింది

  వెంటనే నా నోట్లోంచి ఆ మాట.. నా భార్య చెంప చెల్లుమనిపించింది

  నిజంగా శ్రీదేవితో ఎఫైర్ ఉందని గనక నువ్వనుకుంటే.. నన్ను ఫిజికల్‌గా ఆపగలవు. కానీ నీలో శ్రీదేవిని ఉహించుకొని నీతో ఉంటే ఏంచేయగలవు అని న భార్యను అడిగా. నా నోట్లోంచి ఆ మాట వచ్చిన వెంటనే నా చెంప చెల్లుమనిపించింది. పెళ్లి అనే కమిట్‌మెంట్ కారణంగానే ఇలాంటివి జరుగుతుంటాయి.

  జన్మజన్మల బంధం కాదు.. అగ్రిమెంట్

  జన్మజన్మల బంధం కాదు.. అగ్రిమెంట్

  భార్య, భర్తల బంధం కారణంగా ఫిజికల్‌గా ఒక్కటి కాగలరు గానీ, మెంటల్‌గా ఒక్కటి కాలేరు. పైగా ఈమె నాది.. ఈయన నా వాడు అనే ఫీలింగ్స్ ఉంటాయి. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పెళ్లి వ్యవస్థ నుంచే వస్తాయి అన్నాడు వర్మ. అంతేకాదు భార్యభర్తల మధ్య జన్మ జన్మల బంధం అనే కాన్సెప్ట్ ఎప్పటిదో.. ఇప్పుడంతా అగ్రిమెంట్ బంధం అయిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

  English summary
  Sesetional director Ram Gopal Varma commented on indian marriage system. In latest interview Varma says his personal experience. This video viral on social media.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X