రాజమౌళి ‘ఈగ’ గెలికిన వర్మ-మెగా ఫ్యాన్స్ ఆగ్రహం
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో...నాని, సమంత కథానాయికలుగా 'ఈగ" సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై వివాదాస్పన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. రామ్ గోపాల్ వర్మ ఏమని వ్యాఖ్యలు చేశాడంటే.....''రాజమౌళి కాన్పెప్టు చూస్తుంటే ఆ సినిమా మగధీర కంటే పెద్ద హిట్టయ్యేలా ఉంది. నేను ఆ సినిమా కోసం ఆతృతతో ఎదురు చూస్తున్నా"" అంటూ తన ట్విట్టర్ లో రాశాశాడు.
అయితే రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. ఈగ సినిమాపై కామెంట్లు చేసుకుంటే చేసుకున్నాడు కానీ....రామ్ చరణ్ సూపర్ హిట్ మూవీ మగధీరను కించ పరిచేలా ఆయ మాట్లాడటం బాగోలేదని మండి పడుతున్నారు. వర్మ కేవలం తన ఉనికిని ఎప్పటికప్పుడు చాటు కోవడానికే ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'ఈగ". యంగ్ హీరో నాని, హాట్ హీరోయిన్ సమంత ఇందులో జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. రాజమౌళి ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. హాలీవుడ్ లో తేనెటీగ ప్రధానపాత్రలో వచ్చి హిట్టయిన బీ మూవీ (2007) తరహాలో ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం.


Click it and Unblock the Notifications











