కరోనా లాంటివి వచ్చినప్పుడు RRR కూడా వస్తుంది.. ఆర్జీవి సెన్సేషనల్ కామెంట్స్..
బాహుబలి వంటి అంతర్జాతీయ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకధీరడు రాజమౌళి.. ఆర్ఆర్ఆర్‌ను ఇంకెలా చెక్కుతాడో అందరూ ఊహించేస్తారు. అయితే అందరి ఊహలకు, అంచనాలకు మించేలా టైటిల్ లోగో, మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసి ఫిదా చేసేశాడు. రౌద్రం రణం రుధిరం అంటూ రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది.

భారీ అంచనాలు..
ఆర్ఆర్ఆర్‌పై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తెలుగు నాట ఆకాశాన్నంటే అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి ముఖ్య కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలను జక్కన డైరెక్ట్ చేయడమంటే మామూలు విషయం కాదు.

ఉగాది కానుకగా..
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ తరుణం వచ్చింది. మొత్తానికి ఆర్ఆర్ఆర్ అంటే ఏంటో అందరికీ తెలిసిపోయింది. రౌద్రం రామ్ చరణ్‌ను, రుధిరం ఎన్టీఆర్‌ను ప్రతిబింబిస్తున్నట్టుగా రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.
Recommended Video
ఆర్జీవి కామెంట్స్..
రౌద్రం రణం రుధిరంపై టాలీవుడ్ సెలెబ్రిటీల నుంచి విశేష స్పందన వస్తోంది. వరుణ్ తేజ్, సుధీర్ బాబు, గోపిచంద్ మలినేని, ఆర్జీవి, అఖిల్ వంటి వారు స్పందించారు. ఇలాంటి కష్టకాలంలో దీన్ని రిలీజ్ చేసి భవిష్యత్తులోమంచి జరుగుతుందనే ఆశాభావాన్ని కలిగేలా చేశావ్ అని వర్మ ట్వీట్ చేశాడు. జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్టు కాదు.. కోవిడ్ లాంటి భయంకరమైనవి వచ్చినప్పుడు ఆర్ఆర్ఆర్ లాంటివి గొప్పవి కూడా వస్తాయని అన్నాడు.
మోషన్ పోస్టర్‌లో..
మోషన్ పోస్టర్‌లో జక్కన్న మనకోసం ఎన్నో క్లూస్ వదిలిపెట్టాడు. అంచనాలు ఎన్ని పెట్టుకున్నా.. అంతకు మించి అనిపించేలా మోషన్ పోస్టర్ డిజైన్ చేశాడు. నిప్పులు చెరుగుతూ దూసుకువస్తున్న రామ్ చరణ్, సముద్రం ఉప్పొంగి వస్తున్నట్టుగా ఎన్టీఆర్ దూసుకువస్తున్నాడు.పంచ భూతాల్లోని ఈ రెండు శక్తులు కలిసి పోరాడితే ఆ యుద్దం ఎలా ఉంటుందో చూడండని చిన్న శాంపిల్ వదిలాడు. 1920లో జరిగే రాజమౌళి ఊహాత్మక కథను 2021లో చూడండని చెప్పకనే చెప్పేశాడు.


Click it and Unblock the Notifications











