దేవుడికి మానసిక సమస్యలా? అందుకే థ్రిల్లర్ మూవీస్ చూపిస్తున్నాడా?.. వైజాగ్ ఘటనపై ఆర్జీవి ట్వీట్స్
విశాఖపట్నంలో ఎల్జీ పాలిమెర్ గ్యాస్ లీక ఘటన షాక్ గురి చేసింది. తెల్లవారుజామునే దారుణ దుర్ఘటనతో అందరూ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటనలో ఎనిమిది మందికిపైగా మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం వారంతా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ ఘటనపై రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. వరుస ట్వీట్లూ చేస్తూ..

విశాఖ గ్యాస్ లీక్ ఘటన తర్వాత
దేవుడు అంటే సృష్టికి మూలం, ప్రకృతిలోని అన్నింటిని నియంత్రణలో ఉంచుకొంటాడనే భావనతో ఉన్నాం. కానీ కరోనావైరస్, విశాఖ గ్యాస్ లీక్ సంఘటనలు చూసిన తర్వాత భయాందోళనల నేపథ్యంలో భగవంతుడిని తప్ప అందర్ని తప్పుపట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

దేవుడికి మానసిక సమస్యలా?
కరోనావైరస్ వ్యాప్తి, విశాఖ గ్యాస్ లీక్ యాక్సిడెంట్స్ తర్వాత పరిస్థితులను చూస్తే భగవంతుడికి మానసిక సమస్యలేమైనా తలెత్తాయా అనే సందేహం కలుగకమానదు అంటూ ఆర్జీవి తనదైన శైలిలో ట్వీట్ చేశారు. వరుస ట్వీట్లు చేస్తూ వర్మ ఆసక్తిని రేపుతున్నారు.

ఆ మూడే అందర్నీ చంపేస్తున్నాయి...
పురుషులను, మహిళలను, పిల్లలను చంపే విషయంలో మతం, కులం, జాతీయత అనే విషయాలతో సంబంధం లేకుండా చంపేవి మూడే మూడు ఉన్నాయి. అవేమిటంటే టెర్రరిస్టులు, వైరస్‌లు, దేవుడు అంటూ వర్మ మరో ట్వీట్ చేశారు.
Recommended Video

దేవుడు థ్రిల్లర్ మూవీ చూపిస్తాడు
విశాఖ గ్యాస్ లీక్ సంఘటన జరగగానే వర్మ వరుసగా ట్వీట్లతో విజృంభించారు. కరోనా వైరస్ తర్వాత మనుషులపై గ్యాస్ ఎటాక్ జరిగింది. ఇక గ్రహాంతరవాసుల దాడినే మిగిలి ఉందనుకొంటాను అని ట్వీట్ చేశారు. ఇక మరో ట్వీట్‌లో సినీరంగం మూతవ పడిన తర్వాత దేవుడు తన స్టయిల్‌లో థ్రిల్లర్ మూవీస్ చూపిస్తున్నాడు అని రాంగోపాల్ వర్మ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications