VYOOHAM: పవన్‌ను ఆ జంతువుతో పోల్చిన డైరెక్టర్.. ఆ అమ్మాయి, ఎన్టీఆర్‌ను లాగుతూ సంచలన వ్యాఖ్యలు

రాంగోపాల్ వర్మ.. ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో అస్సలు పరిచయం అవసరం లేదు. అంతలా ఈ సెన్సేషనల్ డైరెక్టర్ తరచూ వార్తల్లోనే ఉంటున్నాడు. గతంలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలు చేసిన ఆయన.. ఈ మధ్య కాలంలో రాజకీయాలపైనే ఫోకస్ చేసి వివాదాస్పద చిత్రాలు తీస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు 'వ్యూహం' అంటూ మరో కాంట్రవర్శీకి తెరలేపాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరిగింది. ఇందులో వర్మ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలను మీరు కూడా చూసేయండి!

కొత్త వ్యూహంతో వస్తున్నాడు
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి లైఫ్ స్టోరీతో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్న సినిమానే 'వ్యూహం'. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఇందులో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్, భారతీ రెడ్డి పాత్రలో మానసలు నటించారు. 'అహంకారానికి ఆలోచనకు మధ్య జరిగే యుద్ధం' అనే కాన్సెప్టుతో ఈ మూవీని రూపొందించిన విషయం తెలిసిందే.

Ram Gopal Varma Compare to Pawan Kalyan With Barrelakka at RGV VYOOHAM Event

గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్
వివాదాస్పద కాన్సెప్టుతో రాబోతున్న 'వ్యూహం' మూవీని డిసెంబర్ 29వ తేదీన ఎంతో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఫంక్షన్ రాజకీయ నాయకుల హాజరు మధ్యన ఎంతో వైభవంగా జరిగింది. దీనికి చాలా మంది అభిమానులు వచ్చి ఈవెంట్‌ను సక్సెస్‌ఫుల్ చేసేశారు.

Ram Gopal Varma Compare to Pawan Kalyan With Barrelakka at RGV VYOOHAM Event

కళ్ల ముందు జరిగే కథతోనే
'వ్యూహం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ.. '25 ఏళ్ల క్రితం సీనియర్ ఎన్టీఆర్ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా నేను లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమా చేశా. కానీ వ్యూహం మూవీ బ్యాగ్‌డ్రాప్ మాత్రం ఇప్పుడు మన కళ్ల ముందు జరుగుతున్నదే. ఇందులో కథ కంటే క్యారెక్టర్స్‌కు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పగలను' అని వెల్లడించాడు.

వాళ్ల సైకాలజీ తెలుసంటూ
ఆ తర్వాత వర్మ కంటిన్యూ చేస్తూ.. 'రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు బయట ఎలా కనిపిస్తారు? వెనక ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు, వ్యూహాలు చేస్తారన్నది సైకలాజికల్ కోణంలో ఇది తెరకెక్కించా. నేను రాజకీయాల్లో లేకున్నా, నాయకుల సైకాలజీని అర్థం చేసుకుంటా. వ్యూహం లాంటి మూవీ వరల్డ్ సినిమాలో రాలేదని చెప్పగలను' అంటూ చెప్పుకొచ్చారు.

ఎన్టీఆర్ పేరు వాడుకుని
వర్మ కొనసాగిస్తూ.. 'లోకేష్ వ్యూహం సినిమాలో వాళ్లను కించపరిచే సీన్స్ ఉన్నాయని కోర్టుకు వెళ్లాడు. మరి లోకేష్ చేస్తున్న పని జగన్‌ను కించపరచడం కాదా. ఇలాంటి లోకేష్ కోర్టుకు వెళ్లడం ఏంటి? ఎన్టీఆర్‌ను చెడ్డవాడిగా చిత్రీకరించిన చంద్రబాబు మళ్లీ ఎక్కడ ఆయన అభిమానుల ఓట్లు పోతాయో అని చెప్పి ఆయనను మహానుభావుడు అనడం మొదలుపెట్టాడు' అన్నారు.

Ram Gopal Varma Compare to Pawan Kalyan With Barrelakka at RGV VYOOHAM Event

బర్రెలక్క ప్రస్తావన తెచ్చి
చివర్లో వర్మ పవన్ కల్యాణ్ ప్రస్తావన కూడా తీసుకు వచ్చాడు. 'పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్‌డమ్ ఉన్న హీరో జనసేన పార్టీని పెట్టినప్పుడు నేను చాలా ఇంప్రెస్ అయ్యా. కానీ ఆయన రాజకీయ నిర్ణయాలు చూసి పవన్ మీద అభిమానం పోయింది. తెలంగాణలో బర్రెలక్క అనే అమ్మాయి ధైర్యంగా రాజకీయాల్లో నిలబడింది. ఆ ధైర్యం కూడా పవన్‌కు లేదు' అని చెప్పాడు.

పవన్‌ను జంతువుగానూ
ఆ తర్వాత రాంగోపాల్ వర్మ 'పవన్ కల్యాణ్ అనే వ్యక్తి కొందరి చేతిలో కీలుబొమ్మగా మారాడు. కనీసం బర్రెలక్క బర్రెలకు కాపలాగా ఉంటూ వాటిని చూసుకుంటుంది. అంటే బర్రెలకు అక్కలా మారింది. కానీ, పవన్ కళ్యాణ్.. చంద్రబాబు మాటలు వినే ఓ బర్రె, గొర్రెలాంటి వాడు. సొంతంగా ఆలోచన చేయలేని వ్యక్తి సూపర్ స్టార్' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X