ఆమె ఫిగర్ చూడాలి, సన్నీలియోన్ వచ్చినప్పుడు ఇలా ఫీలయ్యా: ఇవాంకా పై వర్మ వల్గర్ కామెంట్
Recommended Video

నవంబర్ 28న హైదరాబాద్‌లో జరగబోయే గ్లోబల్ ఎంట్రాప్రెన్యూర్స్ సమ్మిట్లో పాల్గొనేందుకు త్వరలో ఇవాంకా హైదరాబాద్‌లో పర్యటించనున్నసంగతి తెలిసిందే. ఇవాంకా హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో ఫేస్‌బుక్‌లో ఆమెను సన్నీలియోన్‌తో పోలుస్తూ వర్మ కామెంట్లు గుప్పించాడు. ఇవాంకాను బాలీవుడ్ నటి సన్నీలియోన్‌తో పోలుస్తూ.. వర్మ ఫేస్‌బుక్‌లో ఓ కామెంట్ పోస్ట్ చేశాడు.

ఎంతోగానూ ఎదురుచూస్తున్నాను
"నాకు రాజకీయాలపై ఎంతమాత్రం అవగాహన లేదు. అందులో నాకు జ్ఞానం కూడా లేదు. అసలు ఇవాంకా హైదరాబాద్‌లో పర్యటించడానికి గల ఉద్దేశం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కానీ, నేను మాత్రం ఇవాంకా రియల్ అందమైన ముఖాన్ని చూడాలని ఎంతోగానూ ఎదురుచూస్తున్నాను.

సన్నీలియోన్ వచ్చినప్పుడు
గతంలో భారత్‌కు శృంగార తార సన్నీలియోన్ వచ్చినప్పుడు కూడా నేను ఇలాగే చాలా పులకరించిపోయాను' అంటూ వర్మ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇదిలా ఉండగా, ఈనెల 28న హైదరాబాద్‌లో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌కు ఇవాంక హాజరు కానున్న సందర్భంగా భారీ వ్యయంతో హైదరాబాద్‌ను జీహెచ్ఎంసీ ముస్తాబు చేస్తోంది.

వీవీఐపీలు తిరిగే జోన్లో
వీవీఐపీలు తిరిగే జోన్లో కొత్త రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, ఫుట్‌పాత్‌లు, గార్డనింగ్ పనులు ఇలా అనేక అభివృద్ధి పనులు చేపట్టింది. ముఖ్యంగా సదస్సు జరిగే హైటెక్‌సిటీలో పనులు వేగంగా జరుగుతున్నాయి.. ఇవాంకా కోసం తాజ్ ఫలక్‌నుమాప్యాలెస్‌లో ప్రత్యేక విందు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు.

భారీ ఎత్తున భద్రత
ఇవాంకా ట్రంప్ వస్తుండటంతో భారీ ఎత్తున భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇవాంకా మాదాపుర్‌లోని వెస్టిన్ హోటల్‌లో బస చేస్తున్న నేపథ్యంలో మూడురోజుల ముందు నుంచి భద్రతపరమైన ఆంక్షలుంటాయని, అందరూ సహకరించాలని పోలీసులు ఫలక్‌నుమా ప్యాలెస్, మాదాపూర్ వెస్టిన్ హోటల్ పరిసర ప్రాంతాల వారికి ఇప్పటికే స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











