వాళ్ల అంతు చూస్తా.. వదలనంటూ రామ్ గోపాల్ వర్మ సీరియస్ వార్నింగ్!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రం 'లడ్కీ: ఎంటర్ ది గర్ల్ డ్రాగన్'. పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా తెలుగులో అమ్మాయి పేరుతొ జులై 15న విడుదలైన మంచి టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా నిలిపివేయాలని నిర్మాత కె. శేఖర్ రాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ విషయం మీద రామ్ గోపాల్ వర్మ స్పందించారు. శేఖర్ రాజు మీద తీవ్ర స్థాయిలో ఫైర్ అయారు. ఆ వివరాలు

ఫిర్యాదు
తన దగ్గర సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలను వర్మ తీసుకున్నాడని శేఖర్ రాజు ఆరోపించిన క్రమంలో ఈ విషయానికి సంబంధించి తాజాగా పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు రామ్ గోపాల్ వర్మ. నిర్మాత శేఖర్ రాజుపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశాడు. 'లడ్కీ' సినిమాను తప్పుడు పత్రాలతో నిలుపుదల చేశారని సీఐ హరీశ్ చంద్రారెడ్డికి ఇచ్చిన ఫిర్యాదులో ఆర్జీవీ పేర్కొన్నారు.

స్టే తీసుకున్నారని
అనంతరం మీడియాతో మాట్లాడిన రామ్ గోపాల్ వర్మనేను నిర్మించిన సినిమా లడ్కి ఈ నెల 15 రిలీజ్ అయిందని, దానిపై శేఖర్ రాజు అనే వ్యక్తి స్టే తేవడంతో సినిమా ఆగిపోయిందని అన్నారు. హ్యాండ్ లోన్ తీసుకుని ఇవ్వడం లేదని శేఖర్ రాజు నాపై అలిగేషన్స్ చేశారని కానీ కోర్ట్ ను తప్పుదారి పట్టించి శేఖర్ రాజు స్టే తీసుకున్నారని అన్నారు. తప్పుడు పత్రాలను సృష్టించి కోర్టులో కేసు వేశారని అన్నారు.

బ్యాడ్ థింగ్
సినిమాపై ఎంతో మంది ఆధారపడి ఉన్నారన్న వర్మ, నిర్మాత శేఖర్ రాజుకు నేను ఎలాంటి డబ్బు ఇవ్వాల్సింది లేదు. ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరానని తెలిపారు. ఇక దానికి సంబందించిన ఆధారాలు పంజాగుట్ట పోలీసులకు అందించానని అన్నారు. ఇలా సినిమాల మీద స్టే తీసుకు రావడం ఒక ఆనవాయితీగా మారుతోందని అన్నారు. సినిమా ఆపడం అనేది బ్యాడ్ థింగ్ అన్న వర్మ ఇలాంటి మరోసారి పునరావృతం అవ్వొద్దు అని పంజాగుట్ట పీఎస్ లో కేసు పెట్టానని అన్నారు.

ఇదంతా చేస్తున్నారని
ఈ సినిమా ఆగడం వల్ల ఎవరెవరికి ఎంత నష్టం వచ్చింది వారందరూ శేఖర్ రాజు పై కేసులు పెడతారని హెచ్చరించారు. వాళ్ళ ఎండ్ చూస్తా అంటూ చాలా సీరియస్ గా ఫైట్ చేయబోతున్నామని రామ్ గోపాల్ వర్మ అన్నారు. శేఖర్ రాజు కు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, బ్లాక్ మెయిల్ చేసి సెటిల్మెంట్ చేసుకుం అనే భావన తో శేఖర్ ఇదంతా చేస్తున్నారని అన్నారు.

ఆరోపణలు
గతంలో సుధీర్ తో సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా చేసిన శేఖర్ రాజు వర్మతో సినిమా చేయాలనీ ప్రయత్నించి ఆయనని అప్రోచ్ అయినట్టు చెబుతున్నారు. అలా అప్రోచ్ అయిన క్రమంలో వర్మ పలు దఫాలుగా లక్షలాది రూపాయలను తీసుకుని ఇవ్వలేదనే ఆరోపణలు ఉన్నాయి. మరి వర్మ కేసుపై శేఖర్ రాజు ఎలా స్పందిస్తారు అనేది చూడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











