హైదరాబాద్‌ మేయర్‌ను పోలీసులు విచారించాలి.. కేటీఆర్‌కు రాంగోపాల్ వర్మ ఫిర్యాదు

హైదరాబాద్ అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో మరణించిన నాలుగేళ్ల ప్రదీప్ మరణంపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ఘాటుగా స్పందించారు. గతంలో తన పెంపుడు కుక్కకు ఆహారం పెడుతున్న మేయర్ గద్వాల విజయలక్ష్మీ వీడియోను ట్విట్టర్‌లో షేర్ తనదైన శైలిలో కామెంట్స్ వదిలారు. బాలుడి మరణానికి కారణమైన హైదరాబాద్‌ మేయర్‌ను హైదరాబాద్ సిటీ పోలీసులు విచారించాలని డిమాండ్ చేశారు. వర్మ చేసిన ట్వీట్ల వివరాల్లోకి వెళితే..

మేయర్ గద్వాల విజయలక్ష్మీ తన పెంపుడు కుక్కకు భోజనం తినిపిస్తున్న వీడియోను 2021లో షేర్ చేస్తూ... తన కుక్కను ప్రేమించిన దాంట్లో 1 శాతం కూడా తన ఫ్యామిలీని, తన పార్టీని, కేటీఆర్‌ను, కేసీఆర్‌ను, తెలంగాణ ప్రజలను కూడా ఆమె ప్రేమిస్తుందా అనే సందేహం కలుగుతుంది. ఆమె పెంపుడు కుక్కనుపై వాళ్లందరికి ఈర్ష్య ఉంటుందేమో అనిపిస్తుందని అప్పట్లో ట్వీట్ చేశారు.

Ram Gopal Varma complaints to KTR on Hyderabad Mayor Gadwala Vijaya Lakshmi over Street Dog incident of Amberpet

తాజాగా అంబర్‌పేటలో బాలుడిపై వీధి కుక్కల విధ్వంసం తర్వాత మరోసారి ఆ వీడియోను షేర్ చేసి స్పందిస్తూ.. 2021లో ఆ వీడియోను షేర్ చేసినప్పుడు.. ఇలాంటి దారుణానికి దారి తీస్తుందని నేను అసలు ఊహించలేదు. ఇప్పుడు మేయర్ విజయలక్ష్మీ ఆ కుక్కలను ట్రైన్ చేసి పిల్లలను చంపించడానికి ప్రయత్నం చేసిందనే అనుమానం నాలో మొదలైంది. మేయర్ విజయలక్ష్మిని హైదరాబాద్ పోలీసులు ఈ విషయంలో విచారించాలని కేటీఆర్‌ను కోరుతున్నాను అని వర్మ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X