సోనియాగాంధీ కాళ్లకు మొక్కి క్షమాపణ చెబుతా.. మోదీ నంబర్‌వన్ హారర్ ఫిల్మ్ డైరెక్టర్.. ఆర్జీవి సెటైర్లు
దేశంలో కరోనావైరస్ వ్యాప్తి దారుణంగా పెరిగిపోతున్న సమయంలో సరైన చర్యలు చేపట్టడం లేదంటూ ప్రభుత్వాలపై నిరసనలు పెరిగిపోతున్నాయి. అయితే గత కొద్దికాలంగా దేశంలో నెలకొన్న పరిస్థితులు.. పలు ప్రాంతాలు శవాల దిబ్బగా మారుతున్న సమయంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా సోనియాగాంధీ, నరేంద్రమోదీపై చేసిన ట్వీట్లు వైరల్‌గా మారాయి. ఆర్జీవి చేసిన ట్వీట్లు ఏమిటంటే..

నా దేశ ప్రజలారా అంటూ ఆర్జీవి
కరోనాతో భారత్ అతలాకుతలమవుతుంటే మీకు ఒక ప్రశ్న వేయాలనిపిస్తుంది నరేంద్రమోదీ గారు.. మనం ఇప్పుడు అన్ని దేశాలను సహాయం కోసం ఆర్థిస్తున్నాం. అయితే మన ఆత్మ నిర్బర్ ఏమౌంది సార్. నా దేశ ప్రజలారా.. అవసరమైనప్పుడు సహాయం కోసం ప్రార్థించడం నా పాయింట్ కాదు. వాళ్లకు సహాయం చేసే ముందు మనకు అవి అవసరం ఉంటుందని గ్రహించాలన్నదే నా పాయింట్ అని వర్మ ట్వీట్ చేశారు.

మీరే నంబర్‌వన్ హారర్ ఫిల్మ్ డైరెక్టర్
దేశవ్యాప్తంగా అద్భుతమైన హారర్ విజువల్స్ ఇచ్చినందుకు నరేంద్రమోదీ మీకు థ్యాంక్స్. నీవు ఎప్పుడైనా నీ ప్రధాని పదవి కోల్పోతే.. F**k ఇండియా అని మీరు అనడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే మీరు నంబర్‌వన్ హారర్ ఫిల్మ్ డైరెక్టర్ అంటూ వర్మ ట్విట్టర్‌లో సెటైర్ విసిరారు.

నాకు అలాంటి జాబ్ ఇప్పించండి
సార్ నరేంద్రమోదీ జీ, నాకు నేను డీసెంట్ హారర్ ఫిల్మ్ మేకర్ అని అనుకొంటాను. కానీ మీరు త్వరలోనే రూపొందించబోయే హారర్ ఫిల్మ్ కోసం నాకు స్పాట్ బాయ్ ఉద్యోగాన్ని ఇవ్వమని విన్నపం చేసుకొంటున్నాను. థర్డ్ వేవ్ సమయంలో కౌంటింగ్ డిపార్ట్‌మెంట్‌లోనైనా నాకు క్లర్క్ జాబ్ ఇస్తే.. మృతదేహాలను లెక్కించే పని చేస్తాను. ఎందుకంటే మృతదేహాలంటే నీ కంటే నాకే ఎక్కువ ఇష్టం అంటూ వర్మ ట్వీట్‌లో సెటైర్లు గుప్పించారు.

నరేంద్రమోదీ మృత్యు వ్యాపారి
నరేంద్రమోదీ ఓ మృత్యు వ్యాపారి అంటూ 2014లో సోనియా గాంధీ ఆరోపణలు చేస్తే నాకు అప్పుడు సరిగా అర్థం కాలేదు. ఆమెకు అంత గొప్ప విజనరీ ఉంటుందని నేను ఊహించలేదు. అందుకు నేను బేషరుతుగా సోనియా గాంధీకి క్షమాపణ చెబుతున్నాను. ఒకవేళ వీలైతే నీ కాళ్లను ఫోటో తీసి పంపు. వాటిని డిజిటల్ రూపంలో తాకి మొక్కుతాను అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
Recommended Video
మోదీ ఇప్పుడు ఏమంటారు?
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ పార్టీ విజయ ఢంకా మోగించిన నేపథ్యంలో మోదీపై వర్మ సెటైర్లు విసిరారు. నిన్న వరకు బెంగాల్‌లో దీదీ ఫినిష్ అన్నారు. తాజా ఫలితాల తర్వాత మీరు ఏమంటారు సార్ అంటూ ఆర్జీవి సెటైర్ విసిరారు. వర్మ సెటైర్లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











