twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అన్నం పెట్టే రైతులపై రాంగోపాల్ వర్మ నీఛమైన వ్యాఖ్యలు!

    |

    రాంగోపాల్ వర్మ పలు సందర్భాల్లో హద్దులు దాటే వ్యాఖ్యలు చేస్తూ వివాదాల్లో చిక్కుకుంటున్న సంగతి తెలిసిందే. వర్మ ఏ ఎంత మాట్లాడినా పబ్లిసిటీ కోసమే అనే అభిప్రాయం చాలా మందిలో నెలకొంది. ఇటీవల వర్మ సమర్పకుడిగా వ్యవహరించిన భైరవగీత చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి వర్మ వద్ద అసిస్టెంట్ ఎడిటర్ గా పనిచేసిన సిద్దు దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ఓ టివి చర్చా కార్యక్రమంలో వర్మ రైతులని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. దీనితో నెటిజన్లు మరోసారి వర్మపై దుమ్మెత్తి పోస్తున్నారు.

    హద్దులు దాటే రొమాన్స్‌పై అభ్యంతరం

    హద్దులు దాటే రొమాన్స్‌పై అభ్యంతరం

    భైరవ గీత చిత్రంలో హద్దులు దాటే రొమాన్స్, లిప్ లాక్ సన్నివేశాలు ఎక్కుగా ఉండడంతో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఓ టివి చర్చా కార్యక్రమంలో ఇలాంటి సినిమాలు తీసేకన్నా దేశానికి ఉపయోగపడే సినిమాలు చేయవచ్చుగా అని ఓ మహిళ వర్మకు చురకలంటించింది. నాకు రెస్పాన్సుబులిటీ లేదు. సమాజం పట్ల అంతకంటే ద్యాస లేదు. నేను ఇలానే ఉంటా అంటూ మరోమారు వర్మ తన పైత్యాన్ని ప్రదర్శించాడు.

    రైతులంటే చిరాకు

    రైతులంటే చిరాకు

    సదరు టివి యాంకర్ మాట్లాడుతూ.. వర్మ గారూ మీ దర్శత్వంపై పబ్లిక్ లో మంచి అభిప్రాయం ఉంది. ఇలాంటి చిత్రాలు చేసే బదులు రైతు సమస్యలపై సినిమా చేస్తే జనాల్లోకి బాగా వెళ్లే అవకాశం ఉందని తెలిపారు. దీనికి బదులిస్తూ. రైతులపై వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 'రైతులంటే నాకు చిరాకు.. వాళ్ళు ఎప్పుడూ మట్టిలోనే ఉంటారు.. నాకు మట్టి అంటే అసహ్యం' అంటూ నీఛమైన వ్యాఖ్యలు చేశాడు. అందుకే రైతుల సినిమాలు తీయను అని వ్యాఖ్యానించాడు.

     అప్పుడు ఆలోచిస్తా

    అప్పుడు ఆలోచిస్తా

    ఒకవేళ రైతులు తుపాకులు, కత్తులు పట్టుకుంటే అప్పుడు ఆలోచిస్తా అని వర్మ తెలిపాడు. వర్మ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. నెటిజన్లు అతడిపై దుమ్మెత్తి పోస్తున్నారు. దేశానికి వెన్నెముకలాంటి రైతుపై ఇలాంటి వ్యాఖ్యలా చేసేది అంటూ విరుచుకుపడుతున్నారు.

    మరో వివాదాస్పద చిత్రంతో

    మరో వివాదాస్పద చిత్రంతో

    ఆర్జీవీ తెరకెక్కించే ప్రతి చిత్రం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటుంది. ఎన్టీఆర్ బయోపిక్ కు పోటీగా వర్మ మరో వివాదాస్పద చిత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఎన్టీఆర్ జీవితంలో అత్యంత వివాదభరితమైన అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Ram Gopal Varma Controversial comments on farmers. Here is the full details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X