ప్రేమకథ కాదు-బూతు కథ’ వర్మకు పెరుగుతున్న టైటిల్ కష్టాలు
'బెజవాడ రౌడీలు' సినిమా విషయంలో రామ్ గోపాల్ వర్మకు కష్టాలు తప్పేట్టుగా లేవు. టైటిల్ మార్చి తీరాలంటూ ఓ పక్క ప్రజా సంఘాలు ఉద్యమాలు చేస్తుంటే, మరోపక్క ఈ రోజు ఒకరు కోర్టుకి కూడా వెళ్లడం జరిగింది. విజయవాడ ప్రజల మనోభావాలను బాధించే విధంగా వున్న ఈ సినిమా టైటిల్ ను మార్చమని రామ్ గోపాల్ వర్మను ఆదేశించాల్సిందిగా కోరుతూ ఈ రోజు హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. మరోపక్క, దేవుడిని నమ్మని పక్కా నాస్తికుడైన వర్మ, తన సినిమా షూటింగ్ శాంతియుతంగా, ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని ఆకాంక్షిస్తూ, ఈ రోజు శాంతి హోమం నిర్వహించినట్టు తెలుస్తోంది. మరి ఇది వర్మ చిత్తశుద్ధితోనే జరిపారా, లేక పబ్లిసిటీలో భాగమో తెలియాల్సి వుంది.
ఇక తన తాజా చిత్రం మరొకటి 'ఇది ప్రేమ కథ కాదు", నాట్ ఎ లవ్ స్టోరి" పేరుతో హిందీలో తీస్తున్న చిత్రం తెలుగు అనువాదం పేరు ఇది. ఈ చిత్రానికి ప్రచారం కల్పించడం కోసం వర్మ విడుదల చేసిన స్టిల్స్..ఈ సినిమా ప్రేమకథ కాదని బూతు కథని తెలియజేస్తూనే ఉన్నాయి. హీరోయిన్ కావలన్న కోరికతో ముంబాయ్ వచ్చిన ఓ అమ్మాయి అప్పటికే ఒక వ్యక్తితో ప్రేమాయణం నడుపుతూ..సినిమా అవకాశాల కోసం మరొక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. సినిమా అవకాశాల కోసం అక్రమ సంబంధం పెట్టుకున్ వ్యక్తితో కామకలాపాలు సాగిస్తున్న సమయంలో ఆమె బోయ్ ఫ్రెండ్ అక్కడికి అకస్మాత్తుగా చేరుకుని జరుగుతున్నది చూసి చిర్రెత్తిపోతాడు.
ఆ సందర్భంగా జరిగిన కొట్లాటలో మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేసారనేది ఇన్వెస్టిగేట్ చేయడం మిగతా కథ. నిజంగా జరిగిన ఓ సంఘటన చుట్టూ అల్లుకున్న కథ ఇదని వర్మ చెబుతున్నాడు. నిజానికి మన సొసైటీలో జరిగే నేరాల్లో సగం నేరాలు అక్రమ సంబంధాల కారణంగా జరిగేవే. మన చానల్స్ లో ప్రసారం అయ్యే నేరాలు ఘోరాలు వంటివి ఒక్క ఎపిసోడ్ చూసినా ఆ విషయం తెలిసిపోతుంది. కాకపోతే, తన సినిమాకు పబ్లిసిటి కావాలి కాబట్టి నిజంగా జరిగిన సంఘటన అంటూ రామ్ గోపాల్ వర్మ నానా హంగామా చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











