ఏపీలో 10వ పరీక్షలు వాయిదా వేయాలి.. వైస్ జగన్ చిల్ అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్
కరోనావైరస్ విపత్కర పరిస్థితుల్లో ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తన ట్వీట్లకు, సెటైర్లకు పదును మరింత పెట్టారు. కరోనావైరస్ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పరోక్షంగా విమర్శలతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేస్తూ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో వివాదమైన పదో తరగతి పరీక్షలపై ట్వీట్లు చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఆర్జీవి చేసిన ట్వీట్ల గురించి..

వివాదాస్పదంగా 10వ తరగతి పరీక్షలు
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఏపీలో పదో తరగతి పరీక్షలు వివాదాస్పదంగా మారాయి. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష పార్టీలు విమర్శనాస్త్రాలు సంధించుకొంటున్నాయి. ప్రతిపక్షాలు పరీక్షలను వాయిదా వేసి విద్యార్థులను కరోనావైరస్ బారిన పడకుండా చూడాలని కోరుతున్నాయి.

10వ తరగతి పరీక్షలపై ఏపీలో
అయితే విద్యార్థుల భవిష్యత్‌ను పణంగా పెట్టలేనని ఏపీ సర్కార్ పరీక్షల నిర్వహణకే ముందుకు వెళ్తున్నది. స్టూడెంట్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. 10 తరగతి పరీక్షల నిర్వహణపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆర్జీవి తనదైన శైలిలో స్పందించారు.

పరీక్షలను వాయిదా వేస్తే..
ఒకవేళ పదో తరగతి పరీక్షలను వాయిదా వేస్తే 90 శాతం మంది స్టూడెంట్స్ సూపర్ హ్యాపీగా ఫీలవుతారు. ఎందుకంటే.. 90 శాతం సూడెంట్స్ నా మాదిరిగానే బ్యాడ్. వాళ్లందరూ ఎప్పుడూ పరీక్షలు వాయిదా పడాలని కోరుకొంటారు. బుద్దిగా చదువుకొనే 10 శాతం మంది 90 శాతం మంది కింద పనిచేస్తారు. కాబట్టి చిల్ కావాలని వైస్ జగన్‌కు సలహా ఇస్తున్నాను అంటూ వర్మ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Recommended Video

లైఫ్ ముఖ్యమని భావిస్తారు..
ఒకవేళ కోవిడ్ బారిన పడుకుండా ఉంటారా? లేదా ఏడాది స్టడీస్‌ను కోల్పోతారా అనే ఛాయిస్ ఇస్తే.. స్టూడెంట్స్ అందరూ మొదటి ఛాయిస్‌కే ముగ్గుచూపుతారు. ఎందుకంటే వాళ్లకు స్టడీస్ కంటే.. వారి లైఫ్ ముఖ్యమని భావిస్తారు అంటూ వర్మ తన వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











