twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హిందువులంతా ముస్లింలకు క్షమాపణ చెప్పాలి.. రాంగోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు

    |

    దేశంలోనే కాకుండా విదేశాల్లోని పరిస్థితులను బేరిజు వేసుకొంటూ నిత్యం సోషల్ మీడియాలో చెలరేగిపోయే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి తన చేతివాటం ప్రదర్శించారు. తాజాగా దేశంలో జరుగుతున్న కుంభమేళాను ఉద్దేశించి ఘాటైన కామెంట్లు చేశారు. వరుస ట్వీట్లతో ఆర్జీవి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నాయి. ఈ క్రమంలో ఆయన చేసిన పోస్టులు ఏమిటంటే..

    ఎన్ని లాక్‌డౌన్స్ పెడితే..

    ఎన్ని లాక్‌డౌన్స్ పెడితే..

    కుంభమేళకు హాజరైన జనానికి సంబంధించిన ఫోటోను పోస్టు చేసిన వర్మ కామెంట్ చేస్తూ... ఆహా అద్బుతం.. వావ్, ఎంత బాగుంది... ఇవి నా మాటలు కావు. కుంభమేళాలో జన సందోహాన్ని చూసిన కోవిడ్ అంటున్న మాటలు ఇవి. ఎన్ని లాక్‌డౌన్స్ పెడితే గానీ.. దీని వల్ల వ్యాప్తి చెందే కరోనావైరస్‌ను ఆపవచ్చో నాకు తెలియదు అంటూ వర్మ ట్వీట్ చేశారు.

    కుంభమేళాపై ఆర్జీవి సెటైర్లు

    కుంభమేళాపై ఆర్జీవి సెటైర్లు


    కోవిడ్ పరిస్థితుల్లో కుంభమేళాను నిర్వహించడంపై రాంగోపాల్ వర్మ సెటైర్లు విసిరాడు. ఎప్పటిలానే ఆర్జీవి తన వ్యంగ్త్రాలను విసిరాడు. కుంభమేళా.. గుడ్ బై ఇండియా.. వెల్‌‌కమ్ కరోనా అంటూ మరో పోస్టు పెట్టాడు. కుంభమేళకు హాజరైన జనసందోహం ఫోటోను పోస్టు చేశాడు.

    కుంభమేళా బాహుబలిలా.. జమాత్ షార్ట్ ఫిలింలా

    కుంభమేళా బాహుబలిలా.. జమాత్ షార్ట్ ఫిలింలా


    మార్చి 2020లో ఢిల్లీలో నిర్వహించిన జమ్మాత్ సమ్మేళనం కరోనావైరస్ వ్యాప్తికా కారణమనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న కుంభమేళాను చూస్తే బాహుబలిలా అనిపిస్తుంది. దానితో పోలిస్తే జమ్మాతే సమ్మేళనం ఓ షార్ట్ ఫిలింలా కనిపిస్తుంది, అప్పుడు ఏడాది తర్వాత కరోనా ప్రభావం ఇంత ఉంటుందా అనే విషయం వాళ్లకు తెలియకపోయవచ్చు. అయినా తెలిసి ఈ రోజు మనం ఇలా కుంభమేళాను నిర్వహిస్తున్నాం. అందుకు మన హిందువులంతా ముస్లింలకు క్షమాపణ చెప్పాలి అని వర్మ మరో పోస్టు చేశాడు.

    భగవంతుడికే తెలియాలి అంటూ

    భగవంతుడికే తెలియాలి అంటూ


    విశ్వం అనంతం అనే విషయం గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ స్టుపిడిటీ అనంతం అనే విషయం కచ్చితంగా నాకు బోధపడింది అనే విధంగా ప్రముఖ శాస్త్రవేత్త అల్బర్ట్ ఐన్ స్టీన్ చేసిన కోట్‌ను ఉదహరిస్తూ.. ఎడమ వైపున 2021లో నిర్వహిస్తున్న కుంభమేళా.. 2020లో జమ్మాత్ సమ్మేళనం. ఇలాంటి గుడ్డి నమ్మకాలు ఎందుకో భగవంతుడికే తెలియాాలి అంటూ వర్మ మరో పోస్టులో పేర్కొన్నారు.

    English summary
    Popular Director Ram Gopal Varma controversial tweets. He wrote in that, The Delhi Jammat super spreader of March 2020 is like a short film compared to today’s BAHUBALIian KUMBH MELA ..All us Hindus owe an apology to Muslims because they did back then when they dint know and we did this one year after we fully know
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X