twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్జీవీ ‘కరోనా వైరస్’.. రోగం కంటే ట్రైలరే భయంకరంగా ఉందే!

    |

    రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనమే. అది క్లైమాక్స్ రూపంలో మియా మాల్కోవా అందాలను గాలమేసినా సరే. అసలే క్లైమాక్స్ పేరిట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న వర్మ మరో చిత్రాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు. కరోనా వైరస్ అంటూ తనదైన శైలిలో ఓ చిత్రాన్ని తీశాడు. ఈ మేరకు తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ మరింత భయంకరంగా ఉంది. అది చూస్తుంటే కరోనాకు కూడా భయం వేసేలానే ఉంది.

    ప్రస్తుత పరిస్థితి కేంద్రంగా..

    ప్రస్తుత పరిస్థితి కేంద్రంగా..

    ప్రస్తుతం ప్రపంచం అంతా కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కు ఎన్నో లక్షల మంది బలయ్యారు. ప్రత్యక్షంగానో పరోక్షంగా ప్రతీ ఒక్కరూ కరోనాకు బలయ్యారు. ప్రస్తుతం అలుముకున్న పరిస్థితుల నేపథ్యంలో కరోనా వైరస్ చిత్రాన్ని తెరకెక్కించాడు వర్మ.

    ఎవ్వరూ ఆపలేరని నిరూపించడానికే..

    ఎవ్వరూ ఆపలేరని నిరూపించడానికే..

    తన పనిని ఎవ్వరూ ఆపలేరని నిరూపించడానికే కరోనా వైరస్ సినిమాను తెరకెక్కించినట్టు పేర్కొన్నాడు. ఈ మేరకు ట్వీట్ చేస్తూ ‘ఈ కథ లాక్‌డౌన్‌లో పుట్టింది.. లాక్‌డౌన్‌కలోనే షూట్ చేశాము.. మా పనిని దేవుడు కాదు కదా కరోనా లాంటివి కూడా ఆపలేవని నిరూపించడానికే ఇది చేశాన'ని చెప్పుకొచ్చాడు.

    ఓ ఇంటి నేపథ్యంలో..

    అయితే లాక్‌డౌన్ కాబట్టి అవుట్ డోర్ వెళ్లే అవకాశం ఎలాగూ ఉండదు. అందుకే ఓ ఇళ్లు, ఆ ఇంటి సభ్యులు, లాక్ డౌన్ కాలం, కరోనా కేసుల విపరీతంగా పెరిగిపోతూ ఉంటే.. ఆ కుటుంబంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయో చెప్పేలా ట్రైలర్ ఉంది.

    అనుమానంగా, భయంగా..

    అనుమానంగా, భయంగా..

    ఓ ఇంట్లో ఓ అమ్మాయి తీవ్రంగా దగ్గుతూ ఉంటుంది.. అంతే వాళ్ల నాన్నకు ఎక్కడా లేని అనుమానం, భయం పట్టుకుంటుంది.ఇంటి సభ్యులంతా కూడా ఆందోళనం చెందుతూ ఉంటారు. ఆ అమ్మాయి దగ్గరగా వచ్చి కూర్చుంటే.. దూరంగా జరుగుతాడు సోదరుడు. కరోనా వచ్చిందేమో అని సెటైర్స్ వేస్తుంటే.. తండ్రి ధైర్యం చెబుతాడు.. ముసలి వ్యక్తి కూడా అలాగే దగ్గుతూ ఉంటుంది.. ఇక ఇంట్లో పరిస్థితులు మారుతాయి.. భార్య భర్తలు కూడా దూరంగా పడుకుంటారు..

    Recommended Video

    Brothers Day : Naga Babu Emotional Post On Pawan Kalyan And Chiranjeevi
    ట్విస్ట్ అదిరింది

    ట్విస్ట్ అదిరింది

    అయితే చివర్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది. కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రారంభంలో ఇరు రాష్ట్ర సీఎంలు చేసిన కామెంట్స్‌ను పెట్టాడు. ప్యారసెట్మాల్ వేసుకుంటే తగ్గిపోద్దని కేసీఆర్, బ్లీచింగ్ పౌడర్ చల్లితే సరిపోద్దని జగన్ చెప్పడం, వీటిని ఆ కుటుంబ సభ్యులు ఎంతో తీక్షణంగా చూస్తుంటారు. మొత్తానికి కరోనా వైరస్ ట్రైలర్‌తో మరోసారి అందర్నీ భయపెట్టేశాడు వర్మ.

    English summary
    Ram Gopal Varma Corona Virus Trailer Out. HE says That Here is the CORONAVIRUS film trailer..The story is set in a LOCKDOWN and it has been SHOT during LOCKDOWN ..Wanted to prove no one can stop our work whether it’s GOD or CORONA
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X