సినీతారల విడాకులు ఓ వార్నింగ్.. మూర్ఖులే అలాంటి పని.. ధనుష్ డైవోర్స్‌ నేపథ్యంలో వర్మ షాకింగ్ ట్వీట్స్

ప్రేమ, పెళ్లి, కాపురం, దాంపత్య జీవితం లాంటి పదాలంటే దర్శకుడు రాంగోపాల్ వర్మకు రుచించవు. వాటికి పూర్తిగా వ్యతిరేకమని చెప్పుకొంటారు. అందుకే తాను కూడా భార్యకు విడాకులు ఇచ్చి సింగిల్ స్టేటస్‌ను కొనసాగిస్తున్నారు. అయితే తాజాగా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల నేపథ్యంలో ట్విట్టర్‌లో వరుస ట్వీట్లతో తన అనుభవాలను, అభిప్రాయాలను పంచుకొన్నారు. ఆర్జీవి చేసిన ట్వీట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ ట్వీట్ల వివరాల్లోకి వెళితే..

ధనుష్ విడాకుల ప్రకటన తర్వాత

ధనుష్ విడాకుల ప్రకటన తర్వాత

తమిళ స్టార్ హీరో, రజనీకాంత్ అల్లుడు ధనుష్ తన భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకోవడం ఇప్పుడు భారతీయ సినిమా పరిశ్రమలో చర్చనీయాంశమైంది. 18 ఏళ్ల దాంపత్య జీవితానికి ముగింపు పలుకుతూ వారు నిర్ణయం తీసుకొన్నారు. సానుకూలత మధ్య మేము విడిపోతున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించండి. మా ప్రైవసీకి భంగం కలిగించకండి అంటూ ధనుష్, ఐశ్వర్య కలిసి సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఆసక్తికరంగా ట్వీట్లు చేయడం గమనార్హం.

నిజాయితీగా ఉంటే..

నిజాయితీగా ఉంటే..

సమకాలీన పరిస్థితుల్లో అసలు సమస్య ఏమిటంటే.. నిజాయితీగా ఉండేవాళ్లను ఈసడించుకొంటున్నారు. నకిలీ వ్యక్తులను ప్రజలు ప్రేమిస్తున్నారు. అబద్దాలను, అవాస్తవాలతోనే ఎక్కువ శాతం ప్రజలు కంఫర్ట్‌గా ఉంటున్నారు. వాస్తవాలు, నిజాలు ప్రజల నిజస్వరూపాన్ని బయటపెడుతున్నాయి. అబద్దాలు కవరప్ చేస్తున్నాయి అంటూ రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు.

యూత్‌కు ఓ హెచ్చరిక

యూత్‌కు ఓ హెచ్చరిక

సినీ తారలు విడాకులు తీసుకోవడం ఒక రకంగా యువతకు వార్నింగ్ లాంటివి. పెళ్లి అనే ప్రమాదం గురించి ముందే హెచ్చరించినట్టు అవుతున్నది. డైవోర్స్ ఓ ట్రెండ్ సెటర్స్ అంటూ వర్మ మరో ట్వీట్ చేశారు. ప్రేమ కంటే పెళ్లి త్వరగా ఖూనీ అవుతుంది. ప్రేమించినంత కాలం ప్రేమించడమే హ్యాపీనెస్‌ వెనుక అసలు సీక్రెట్. ప్రేమించకుండా పెళ్లి చేసుకోవాలని చూడటం ఓ జైలు లాంటింది అని వర్మ తెలిపారు.

తెలివైన వాళ్లు ప్రేమిస్తారు..

తెలివైన వాళ్లు ప్రేమిస్తారు..

వైవాహిక వ్యవస్థలో ప్రేమ అనేది చాలా త్వరగా కనుమరుగైపోతుంది. పెళ్లి కోసం మూడు నుంచి 5 రోజులు సెలబ్రేట్ చేసుకొనే రోజుల కంటే తక్కువగానే రోజుల్లోనే వారి మధ్య ప్రేమ తెరలు తొలిగిపోతాయి. తెలివైన వాళ్లు ప్రేమిస్తారు.. మూర్ఖులు పెళ్లి చేసుకొంటారు అని తన వేదాంతాన్ని రాంగోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.

భార్యకు ఆర్జీవి విడాకులు ఇచ్చి

భార్యకు ఆర్జీవి విడాకులు ఇచ్చి

రాంగోపాల్ వర్మ వైవాహిక జీవితం విషయానికి వస్తే.. రత్నను వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా మారిన తర్వాత తన భార్యకు విడాకులు ఇచ్చారు. వారిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. విడాకుల తర్వాత కూడా తన భార్యతో రాంగోపాల్ వర్మ స్నేహంగా ఉంటున్నారు. వారిద్దరూ ఫ్రెండ్స్ మాదిరిగా కలిసి పార్టీలకు హాజరవుతుంటారు.

Recommended Video

Amala Paul Reacts On Her Latest Viral Photos
ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన

ధనుష్, ఐశ్వర్య విడాకుల ప్రకటన

ఐశ్వర్య రజనీకాంత్ కూడా ధనుష్ పోస్టు చేసిన ప్రకటనను తన పేరుతో తన ఇన్స్‌టాగ్రామ్‌లో రిలీజ్ చేసింది. 18 ఏళ్ల వైవాహిక జీవితాన్ని ఇక కొనసాగించలేం. మా నిర్ణయాన్ని మీరు గౌరవించాలి. మా ప్రైవసీకి భంగం కలిగించరనే అనుకొంటున్నాను. మీ అందరి ప్రేమను ఆకాంక్షిస్తూ.. వేగంగా దేవుడు తీసుకొన్న నిర్ణయం అంటూ ఐశ్వర్య రజనీకాంత్ పోస్టులో తెలిపారు. ఈ విడాకులు ప్రకటనకు ఎలాంటి కాప్షన్ అవసరం లేదు. మీరు అర్ధం చేసుకోవడం, ప్రేమను కురిపించడమే ముఖ్యం అంటూ ఐశ్వర్య రజనీకాంత్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X