కన్నీటితో చంద్రబాబు.. దించేసిన రామ్ గోపాల్ వర్మ.. మరో సంచలనం

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయన ఎప్పుడెలాంటి బాంబ్ వేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్‌లో షాక్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చం చంద్రబాబు లాగే ఉన్న ఓ యాక్టర్‌ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు వర్మ. ఆ వివరాలు చూస్తే..

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. వాస్తవానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వలేదు. ఊహించని విధంగా మహేష్ బాబు పుట్టిన రోజు నాడు ఈ సినిమా పాట విడుదల చేసి షాకిచ్చాడు వర్మ.

ఆ తర్వాత టార్గెట్.. పవన్ కళ్యాణ్

ఆ తర్వాత టార్గెట్.. పవన్ కళ్యాణ్

ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్‌గా ఉన్న వర్మ.. ఆగస్టు 22 వ తేదీన (చిరంజీవి పుట్టిన రోజు) మరోసారి తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను తెరపైకి తెచ్చాడు. అచ్చం పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న ఓ యాక్టర్‌ ఫోటోని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఇప్పుడు చంద్రబాబు.. కన్నీటితో

తాజాగా తన సినిమాలోని చంద్రబాబు లుక్ బయటకు వదిలిన వర్మ.. ఈ సారి భారీ సంచలనానికి నాంది పలికాడు. కన్నీటితో ఉన్న చంద్రబాబు లుక్ వదులుతూ నిజ జీవితంలో ఈ రోల్ ఎవరిదో చెప్పండి అంటూ ట్వీట్ చేశాడు. దీంతో చంద్రబాబు అంటూ పెద్ద ఎత్తున రెప్లైలు పెడుతున్నారు నెటిజన్లు.

 చాలా అర్థం దాగి ఉందిలే..

చాలా అర్థం దాగి ఉందిలే..

వర్మ ఏది చేసినా అందులో ఏదో ఒక అర్థం దాగి ఉంటుంది. తాజాగా వదిలిన ఈ చంద్రబాబు లుక్ వెనుక కూడా చాలా అర్థమే దాగి ఉందిలే అని చెప్పుకుంటున్నారు ఇది చూసిన జనం. ఇటీవల ఘోర పరాజయం పాలై పలు విమర్శల పాలవుతున్న చంద్రబాబు పరిస్థితి ఇదీ! అని చెప్పకనే చెప్పేశాడని అంటున్నారు.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రెగ్యులర్ షూటింగ్

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రెగ్యులర్ షూటింగ్

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రామ్ గోపాల్ వర్మ చాలా టెక్నిక్స్ ప్లే చేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. సరైన టైమ్‌ని, సరిగ్గా క్యాచ్ చేసుకుంటూ వర్మ చేస్తున్న ఈ పోస్టులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతోందని వెల్లడించాడు వర్మ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X