ఊహించని షాక్.. పవన్ కళ్యాణ్‌ని పట్టుకొచ్చిన వర్మ! నెటిజన్లు పరేషాన్

రామ్ గోపాల్ వర్మ అంటేనే ఓ సంచలనం. ఆయన ఎప్పుడెలాంటి బాంబ్ వేస్తారో ఎవ్వరూ ఊహించలేరు. తనకేదనిపిస్తే అదే చేస్తా అని నిర్మొహమాటంగా చెప్పే వర్మ ఒక్కోసారి ఒక్కో స్టైల్‌లో షాక్ ఇస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా అచ్చం పవన్ కళ్యాణ్ లాగే ఉన్న ఓ యాక్టర్‌ని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు. పూర్తి వివరాలు చూస్తే..

మహేష్ బాబు పుట్టిన రోజు.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

మహేష్ బాబు పుట్టిన రోజు.. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తర్వాత రాంగోపాల్ వర్మ చేస్తున్న తాజా చిత్రం ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'. వాస్తవానికి ఈ సినిమాను చాలా రోజుల క్రితమే ప్రకటించాడు. కానీ, దీనికి సంబంధించిన అప్‌డేట్ ఇవ్వలేదు. కానీ ఊహించని విధంగా మహేష్ బాబు పుట్టిన రోజు నాడు ఈ సినిమా పాట విడుదల చేసి షాకిచ్చాడు వర్మ.

చిరంజీవి పుట్టిన రోజు.. పవన్ కళ్యాణ్‌ని పట్టుకొచ్చాడు

చిరంజీవి పుట్టిన రోజు.. పవన్ కళ్యాణ్‌ని పట్టుకొచ్చాడు

ఆ తర్వాత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న వర్మ.. తాజాగా ఈ రోజు (ఆగస్టు 22) చిరంజీవి పుట్టిన రోజున మరోసారి తన 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాను తెరపైకి తెచ్చాడు. అచ్చం పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న ఓ యాక్టర్‌ ఫోటోని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు.

అతన్ని చూపిస్తూ వర్మ కామెంట్

అచ్చం పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న ఈ యాక్టర్ ని చూపిస్తూ ఇతను 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' సినిమాలో ఏ రోల్ లో నటిస్తున్నాడో గుర్తుపట్టండి అని కామెంట్ పెట్టాడు వర్మ. ఇతన్ని చూస్తే ఎవ్వరైనా సరే ఠకీమని పవన్ కళ్యాణ్ అని ఫిక్స్ అయిపోవాల్సిందే. కానీ అతను పవన్ కాదు.. పవన్ వేషంలో ఉన్న ఓ యాక్టర్. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

 మొత్తానికైతే టైమ్ చూసుకొని వదులుతున్నాడు

మొత్తానికైతే టైమ్ చూసుకొని వదులుతున్నాడు

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' రామ్ గోపాల్ వర్మ చాలా టెక్నిక్స్ ప్లే చేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. గతంలో మహేష్ బాబు పుట్టిన రోజున అలా, ఇప్పుడు చిరంజీవి పుట్టిన రోజున ఇలా తన సినిమా ప్రమోషన్ చేసేశాడు వర్మ. నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా గడిపే రోజులనే టార్గెట్ చేస్తూ వర్మ చేస్తున్న ట్వీట్ నెట్టింట రచ్చ చేస్తున్నాయి. ఈ రకంగా వర్మ సరైన టైమ్‌ని, సరిగ్గా క్యాచ్ చేసుకుంటున్నాడని చెప్పుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X