RGV దమ్ మారో దమ్.. పబ్‌లో హీరోయిన్‌కు ముద్దులు పెడుతూ రచ్చ.. వీడియో వైరల్!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనం అవుతూనే ఉంటుంది. ఆయన మాట తీరు, ప్రవర్తన అన్ని విషయాలు కూడా చర్చనీయాంశం అవుతూనే ఉంటాయి. తాజాగా ఆయన ఒక హీరోయిన్ తో కలిసి సిగరెట్ తాగుతున్న వీడియో వైరల్ అయింది. ఆ వివరాల్లోకి వెళితే..

అరుదుగా బయటకు

అరుదుగా బయటకు

సాధారణంగా రామ్ గోపాల్ వర్మ తన లైఫ్ ని కింగ్ సైజ్ లో అనుభవిస్తూ ఉంటారు. ఈ మధ్య అసలు స్టార్స్ తో సినిమాలు చేయడం మానేసిన ఆయన తనకు నచ్చిన వారిని, తాను ఏం చెప్పినా చేసే నటీనటులతోనే సినిమాలు చేస్తున్నారు. అందుకే వర్మకు హీరోయిన్లకు మధ్య అఫైర్లు ఉంటాయని గుసగుసలు వినిపిస్తుంటాయి. అయితే తనకు నచ్చితే వారినే ఎలాంటి మొహమాటం లేకుండా అడిగేస్తా అని బహిరంగంగానే వర్మ చెబుతుంటారు. అలా వర్మ తన హీరోయిన్లతో ఎంజాయ్ చేసే ఫోటోలు, వీడియోలు అరుదుగా బయటకు వస్తూ ఉంటాయి.

 పబ్‌లో అమ్మాయిలతో

పబ్‌లో అమ్మాయిలతో

ఆర్జీవీ తాజా వీడియో ఇప్పుడు ఒక వీడియోతో అందరినీ ఆశ్చర్యపరిచారు. తాజాగా ఓ వీడియోను షేర్ చేసిన వర్మ అందరినీ ముక్కున వేలేసుకునేలా చేశారు. తాజాగా పబ్‌లో అమ్మాయిలతో మద్యం తాగుతూ, సిగరెట్ వెలిగించి గుండెలనిండా పీలుస్తూ చిందులేశాడు ఆర్జీవీ. దీనికి సంబంధించిన వీడియోలను, ఫోటోలను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసుకున్నాడు.

 తాగుతున్న ఫోటోలు

తాగుతున్న ఫోటోలు

ఆయన షేర్ చేసిన సిగరెట్‌ తాగుతూ, మందు తాగుతూ పబ్‌లో హీరోయిన్ ఇనయా సుల్తానాకు ముద్దు పెడుతున్న వీడియో కూడా షేర్ చేయగా వైరల్ అయింది. ఇనయా సుల్తానాతో సిగరెట్ తాగుతున్న ఫోటోలు, మందు తాగే ఫోటోలు కూడా తన అకౌంట్ నుంచి వర్మ షేర్ చేశాడు. ఇనయా కూడా వాటిని తన సోషల్ మీడియాలో షేర్ చేయడం గమనార్హం.

కాళ్ల మీద కూడా పడి

కాళ్ల మీద కూడా పడి

గతంలో కూడా ఇనయా సుల్తానా బర్త్‌డే వేడుకల్లో ఆర్జీవీ పాల్గొని ఆమెతో డ్యాన్స్‌ చేస్తూ ఇనయా సుల్తానాను వర్మ కౌగిట్లో నలిపేశారు. ఆమె చుట్టూ తిరుగుతూ పిచ్చి పిచ్చి చేష్టలు చేసిన వీడియో వైరల్ అయింది. చివరకు ఆమె కాళ్ల మీద కూడా పడి అప్పట్లో రచ్చ రచ్చ చేశారు.. ఇనయ సుల్తానా వర్మ సినిమాల్లో ఇప్పటిదాకా కనిపించలేదు కానీ ఇక మీదట కనిపించే అవకాశం కనిపిస్తోంది.

Recommended Video

RRR Movie టికెట్ ప్రైస్ రాజమౌలి డిసైడ్ చెయ్యాలి.. AP Govt కి ఎందుకు ? - RGV | Filmibeat Telugu

'కొండా'సినిమా

ఇక కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా వర్మ 'కొండా' అనే సినిమా తెరకెక్కించారు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్‌ గా పేరు మార్చుకున్న ఆదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ట పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ మధ్యనే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X